వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిదే హైదరాబాద్, కేంద్రం పెత్తనం వద్దు: మజ్లిస్ కసరత్తు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు పైన కేంద్రం అజమాయిషీకి మజ్లిస్ పార్టీ ససేమీరా అంటోంది. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తి లేదని ఆ పార్టీ మొదటి నుండి చెబుతోంది. ఈ నేపథ్యంలో మంత్రుల బృందానికి(జివోఎం)కు నివేదిక సమర్పించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ, ఇతరులు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో అంతర్భాగంగానే హైదరాబాద్‌ను పరిగణించాలని, శాంతిభద్రతలు, ఇతర పాలనా సంబంధ వ్యవహారాలపై కేంద్రం అజమాయిషీ ఉండరాదని ఆ పార్టీ భావిస్తోంది. అలాగే సీమాంధ్ర జిల్లాల నుంచి వలస వచ్చిన కుటుంబాలకు రక్షణ కల్పించడం పైనా దృష్టి సారించాలని నిర్ణయించింది.

జివోఎంకు నివేదిక ఇచ్చే విషయమై చర్చించేందుకు అసద్దీన్ నేతృత్వంలో పార్టీ సీనియర్లు ఇప్పటికే రెండుసార్లు సమావేశమయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూను ఏయే పాళ్లలో పంపిణీ చేయాలో ముందుగానే ఖరారు చేయాలని కూడా మజ్లిస్ సూచించనుంది. సోమవారం మరోసారి సమావేశమై చర్చించనుంది.

కాగా, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి జివోఎంకు నివేదిక పంపించిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్రలో అన్ని రకాలుగా నష్టపోయిన తెలంగాణకు రూ.4.5 లక్షల కోట్లు ఇవ్వాలని, శాసన మండలిని కొనసాగించాలని, ప్రస్తుత భవనాల నుండి తెలంగాణ పాలన ఉండాలని, కొత్త రాష్ట్రం చేతికే శాంతిభద్రతలు ఇవ్వాలని, సీమాంధ్రకు ప్రత్యేక భవన సముదాయం ఇవ్వాలని, రెండేళ్లలో కొత్త రాజధానిలో ఎపి పాలనకు ఏర్పాట్లు చేయాలని, గోదావరి, కృష్ణాలపై తెలంగాణకు జాతీయ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని, సింగరేణిలో పూర్తి వాటా తెలంగాణకే ఇవ్వాలని, గ్యాస్ నిక్షేపాల్లో వాటా ఇవ్వాలని, 1956కు ముందున్న ఆస్తులు తమవేనని, 371 డిని కొనసాగించాలని అందులో పేర్కొన్నారు.

English summary
The MIM leaders met two times to prepare report to give Group of Ministers(GoM)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X