జగన్‌తో మజ్లిస్ రెడీ, షరతు: తెలంగాణలో కాంగ్రెస్‌తో..

హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల దూకుడును నిలువరించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. అందులో భాగంగా సీమాంధ్రలో మజ్లిస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని ముస్లిం మైనార్టీ ఓట్లను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. మజ్లిస్ సైతం పార్టీ విస్తరణకు ఇదే మంచి అవకాశమన్న ఉద్దేశంతో జగన్ పార్టీతో కలిసి అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది.

ఇటీవల మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా తదితరులు సీమాంధ్ర ప్రాంతంలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజ్లిస్ అభ్యర్థుల తరఫున విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పట్ల మైనార్టీలు సానుభూతితో ఉన్నారని వారు ఓ అవగాహనకు వచ్చినట్లు సమాచారం.

MIM may ready to alliance with YSRCP

కోస్తాంధ్ర జిల్లాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్ల ప్రభావం పెద్దగా లేకున్నా, రాయలసీమ జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే స్థాయిలో ఉన్నారని, జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మజ్లిస్ పార్టీని సీమాంధ్రలోనూ విస్తరించవచ్చని వారు ఓ అంచనాకు వచ్చారంటున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రాంతంలో బోణీ కొట్టాలని మజ్లిస్ నేతలు భావిస్తున్నారు.

ప్రధానంగా కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ముస్లిం మైనారిటీ ఓటర్లు సుమారు 12 నుంచి 17శాతానికి పైగా ఉన్నారు. జగన్ పార్టీతో కలిసి పోటీ చేయడంద్వారా సీమాంధ్ర శాసనసభలో మజ్లిస్ పాగా వేయవచ్చునని భావిస్తున్నారు. అయితే, జగన్‌తో కలిసేందుకు మజ్లిస్ షరతు పెడుతోందట.

ప్రస్తుతమే కాదు భవిష్యత్‌లోనూ బిజెపితోను పొత్తు పెట్టుకోవడం కానీ, మద్దతు ఇవ్వడం కానీ చేయబోమని జగన్ పార్టీ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని మజ్లిస్ నేతలు డిమాండ్ చేస్తున్నారట. దీనికి జగన్ పార్టీ సానుకూలంగా స్పందించి సంప్రదింపులకు సిద్ధమైనట్లు సమాచారం.

రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓట్లు గెలుపోటములను నిర్ణయిస్తాయని గుర్తించిన జగన్ పార్టీ నేతలు మజ్లిస్‌తో ఎన్నికల పొత్తుకు తహతహలాడుతున్నట్టు సమాచారం. మరోవైపు, తెలంగాణ జిల్లాల్లో జగన్ పార్టీ ప్రభావం పెద్దగా లేనందున మజ్లిస్ కాంగ్రెస్ పార్టీతో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+