ఆ ఇద్దరూ పెద్ద కట్టప్ప, చిన్న కట్టప్ప -మంత్రి అమర్‌నాథ్‌ ..!!

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు చేసారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు అండ్‌ కో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పాలనలో జీఎస్‌డీపీలో 22వ స్థానంలో ఉంటే.. నేడు నంబర్‌ వన్‌ స్థానంలో రాష్ట్రం ఉందని చెప్పారు. పారిశ్రామిక రంగంలో ఏపీకి 3వ స్థానం వచ్చిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. వెన్నుపోటు గురించి మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అమర్‌నాథ్‌ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే పవన్‌కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. చంద్రబాబు పెద్ద కట్టప్ప అయితే నాదెండ్ల చిన్న కట్టప్ప అని అభివర్ణించారు. టీడీపీ పాలనలో జీఎస్‌డీపీలో 22వ స్థానంలో ఉంటే.. నేడు నంబర్‌ వన్‌ స్థానంలో రాష్ట్రం ఉందన్నారు. జీఎస్‌డీపీ ర్యాంక్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇస్తుందని చెప్పారు.

Minister Amarnath made serious comments against Chandra Babu and Pawan Kalyan

ఆరు పోర్టులకు అదనంగా మరో నాలుగు పోర్టులు నిర్మిస్తున్నామని, 10 ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తున్నామని, బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను నిర్మిస్తున్నామని మంత్రి వివరించారు. 2019లో తలసరి ఆదాయంలో ఏపీ 17వ స్థానంలో ఉంటే.. నేడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో 9వ స్థానంలో ఉందని చెప్పారు. జగన్‌ నేతృత్వంలో వ్యవసాయ రంగంలో ఏపీ 6వ స్థానంలో నిలిచిందన్నారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు పాలనలో రాష్ట్రం 27వ స్థానంలో ఉండేదని గుర్తుచేశారు. 13 లక్షల మందికి ఎంఎస్‌ఎంఈ ద్వారా ఉపాధి కల్పించామని, పారిశ్రామిక రంగంలో ఏపీకి 3వ స్థానం వచ్చిందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+