పవన్ కల్యాణ్ కు అంబటి రాంబాబు కీలక సూచన..!!

మంత్రి అంబటి రాంబాబు వర్సస్ జనసేనాని పవన్ మధ్య కొంత కాలంగా డైలాగ్ వార్ కొనసాగుతోంది. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో వైసీపీని లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర ఆరోపణలు చేసారు. కురుపాం సభలో పవన కళ్యాణ్ వివాహాల పైన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీనికి కౌంటర్ గా పవన్ సీఎం జగన్ కు సంబంధించి ప్రతీ విషయం తనకు తెలుసని..తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే బయట పెడతానంటూ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ భీమవరం సభలో చేసిన కామెంట్స్ పైన మంత్రి రాంబాబు స్పందించారు. పవన్ రాజకీయాలకు పనికిరారని విమర్శించారు. ఒంటి చేత్తో 150 మందిని గెలిపించిన సీఎం వైయస్‌ జగన్‌ లాంటి వీరుడిని రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్‌ ఏమీ చేయలేడన్నారు. ప్రాణాలకు తెగించాను.. తెగించాను అని మాట్లాడుతున్నాడని, రాజకీయాల్లో ప్రాణాలకు తెగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పెత్తందార్లు, చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీని భుజాన మోస్తున్న పవన్‌కు.. పోరాటం గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. జగన్‌ గురించి అంతా తెలుసు అని మాట్లాడే పవన్‌ ఒక పుస్తకం రాసి ఆవిష్కరిస్తే ప్రజలంతా చదువుతారు కదా అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

ambatipawan

నీ వ్యక్తిత్వం గురించి మాట్లాడితే వెంట్రుక, నువ్వు మా గురించి మాట్లాడితే అదేమైనా బ్రహ్మాస్తమా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ నుంచి రావడం, మాతో తిట్టించుకోవడం, వెళ్లి నిద్రపోవడం ఇదే పవన్‌ పని. మాతో తిట్టించుకోనిదే పవన్‌కు నిద్రపట్టదని రాంబాబు పేర్కొన్నారు. ఆవేశంగా మాట్లాడేవాడు అధైర్యవంతుడన్నారు. వ్యాన్‌కు వారాహి అని దేవత పేరు పెట్టి దానిపై ఎక్కి చిందులేస్తున్నాడు. రాజకీయాల్లో ప్రాణాలకు తెగించడానికి సంబంధం ఏంటని నిలదీసారు. పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే మహా సంగ్రామం రేపు జరగబోయే ఎన్నికలని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్‌ల పల్లకీ మోస్తున్న పవన్‌కు పోరాటం గురించి మాట్లాడే అర్హత లేదని అంబటి వ్యాఖ్యానించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్‌ ఎవరి జెండా ఎగురవేస్తారో పవన్ చెప్పాలని రాంబాబు డిమాండ్ చేసారు. కేవలం డబ్బు కోసం పవన్‌ కల్యాణ్‌ ఆట ఆడుతున్నారని... పవర్‌ను చంద్రబాబుకు ఇచ్చి కులాన్ని అమ్మేసి డబ్బు సొమ్ముచేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పవన్‌.. ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తాడో, ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పరని ఎద్దేవా చేసారు. పవన్‌ పిచ్చి వ్యాఖ్యలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారంటూ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+