అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అసెంబ్లీలొ చర్చకు రావాలి - పవన్ ఎలా మద్దతిస్తారు : అంబటి..!!

|
Google Oneindia TeluguNews

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పైన వైసీపీ మంత్రులు వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచుతున్నారు. చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని పిలుపునిస్తున్నారు. చంద్రబాబు సమావేశాలకు రావాలని.. పోలవరం పైన చర్చలో పాల్గొనాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. పోలవరం ఆలస్యానికి జగనే కారణం అని నిరూపిస్తాం చర్చకు సిద్ధమా అని అడిగారని..అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి గా పని చేసిన దేవినేని ఉమ కూడా ఇదే మాట్లాడారని అంబటి గుర్తు చేసారు.

పోలవరంపై చర్చకు సిద్దమంటూ

పోలవరంపై చర్చకు సిద్దమంటూ

తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పిన మంత్రి రాంబాబు.. శాసనసభ వేదికగా టీడీపీ ప్రబుత్వ హాయంలో తీసుకున్న అవివేక నిర్ణయాలు, తాము చేస్తున్న ప్రయత్నాలు గురించి చెబుతామని పేర్కొన్నారు.రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు ఓటు వేయటానికి మాత్రం చంద్రబాబు శపథం పక్కన పెట్టి శాసనసభ ప్రాంగణంలో అడుగుపెట్టారుగా అంటూ ఎద్దేవా చేసారు.

శాసనసభ సమావేశాలకు హాజరవడం ప్రతిపక్ష సభ్యుల బాధ్యతను గుర్తు చేస్తున్నాని వ్యాఖ్యానించారు. అమరావతి స్కామ్‌కు పునాది వేసింది చంద్రబాబే అని మంత్రి రాంబాబు విమర్శించారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు సృష్టించేందుకు అమరావతి పాదయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతిపై నాడు ఏం చెప్పారు

అమరావతిపై నాడు ఏం చెప్పారు

అమరావతి అనేది ఒక పెద్ద స్కామ్‌ అని, అమరావతి ప్రజా రాజధాని కాదని నాడు జనసేన, సీపీఐ, సీ పీఎం నేతలు చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు వాల్లే పాదయాత్రకు డప్పులు కొడుతున్నారని తప్పుపట్టారు. పాదయాత్రలో ఒక్క రైతైనా ఉన్నారా అని మంత్రి ప్రశ్నించారు.

చంద్రబాబు 2018 కల్లా పోలవరం ఎందుకు పూర్తి చేయాలేదని మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. డయాఫ్రమ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. గతంలో చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన ఐవీఆర్‌ కృష్ణరావు ఒక పుస్తకం రాశారని గుర్తు చేసారు.

పాదయాత్రను తిప్పి కొడతారు

పాదయాత్రను తిప్పి కొడతారు

ఈ రాజధాని ఎవరిది అన్నది ఆ పుస్తకం, ఆ పుస్తకాన్ని జనసేన అధినేత పవన్‌ ఆవిష్కరిస్తే..ఆకార్యక్రమానికి సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారన్నారు. ఆ సమయంలో వారు ఏం చెప్పారో ఒకసారి గమనించాలని సూచించారు. ఏపీ ఒకసారి మోసపోయిందని ఆ రోజు చెప్పారని గుర్తు చేసారు హైదరాబాద్‌లోనే అన్ని కేంద్రీకరించడంతో అక్కడ మోసపోయాం.

వికేంద్రీకరణ జరగాలని ఆ వేదికపై ఉపన్యాసాలు చేశారు. ఇది ధర్మమేనా సీపీఐ, సీపీఎం, బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను దోచుకున్నారు. నారాయణ, గంటా శ్రీనివాస్‌ బంధువులు అసైన్డ్‌భూములను ప్రజల నుంచి పావలా, అర్ధరూపాయికి తీసుకున్నారని విమర్శించారు. ఈ పాదయాత్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొడతారని హెచ్చరించారు.

English summary
Minister Ambati Rambabu fires on TDP Chief Chandra Babu, says Govt ready for discussion on plavaram in the house. Ambati Key remaks on Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X