టీడీపీ, జనసేన పొత్తు పై జరుగుతోంది ఇదే - అంబటి..!!

చంద్రబాబు అవినీతి డబ్బుతో వారాహి యాత్ర జరుగుతోందని మంత్రి అంబటి ఆరోపించారు. బీజేపీతో ఉంటూనే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటంటూ ప్రశ్నించారు. జనసేన కార్యకర్తలు.. జనసైనికులు కాదు.. సైకిల్ సైనికులు అంటూ ఎద్దెవా చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాజకీయాలు కలుషితం చేశారని విమర్శించారు. పవన్ తాజా యాత్ర..స్పీచ్ ఫ్లాప్ అయ్యాయని విశ్లేషించారు.

జనసేనాని పవన్ పైన మంత్రి అంబటి రాంబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. జైలులో చంద్రబాబుతో పవన్ పొత్తు ఖాయం చేసుకున్నారని విమర్శించారు. వ్యూహం ప్రకారమే కాపులు అధికంగా ఉన్న చోట పవన్ సభలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ యాత్రలు చేస్తున్నారని చెప్పిన అంబటి..వారాహి యాత్ర ఫ్లాప్ అయిందని విమర్శించారు. పవన్ ప్రసంగంలో పస లేదని పేర్కొన్నారు. జైల్ లో చంద్రబాబు దీక్షలు చేయడం విడ్డురంగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు. జనసేన టీడీపీ కలయిక జనం ఆదరించడం లేదని అంబటి చెప్పుకొచ్చారు. రాజకీయాలను అవినీతిమయం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

MInister Ambati Rambabu

చంద్రబాబు దీక్షతో మహాత్మా గాంధీ ఆత్మ క్షోభిస్తుందని అంబటి వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడి దీక్షలకు దిగే వారిని ప్రజలు నమ్మవద్దని సూచించారు. చంద్రబాబు,లోకేష్ సూచనతోనే ఇలా సమావేశాలు పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తో కలిసి వెళ్తున్నాను అని చెప్పిన తర్వాత కాపుల నుంచి స్పందన లేదని చెప్పుకొచ్చారు. అవనిగడ్డ సభలో పవన్ గొంతు వీక్ అయిందన్నారు. పవన్ తప్పు చేస్తున్నాడని దివిగడ్డ మీద జనం చెప్పారని వివరించారు. బీజేపీ తో ఉన్నాడో లేదో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు తర్వాత అనైతికత ఉన్న వ్యక్తి పవన్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. కమలం పార్టీ చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టాడని ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాన్ రాజకీయాలకు పనికిరాని వ్యక్తిగా అంబటి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+