చంద్రబాబుకు విజన్ ఉంది, జగన్ కు అది ఉంది, అంతే తేడా, మంత్రి ఆనం
గత వైసీపీ ప్రభుత్వం వలన ఆ పార్టీ నాయకులకు లాభాలు తప్పా వారివలన సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు.
నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాజెక్టులను పూర్తిగా గాలికి వదిలేసిన వైసీపీ నాయకులు ఆ ప్రాజెక్టుల కోసం ఖర్చు చెయ్యాల్సిన డబ్బులు వారి జేబుల్లో వేసుకుని జల్సాలు చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో రైతులను సర్వ నాశనం చేశారని, అన్నదాతలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని, రైతులను ఆదుకోవడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. రెండున్నరేళ్ల క్రితం వరదల్లో సోమశిల ప్రాజెక్టు దెబ్బతిన్నా దానిని మరమ్మతులు చేయడానికి జగన్ ఏమాత్రం ఆసక్తి చూపించలేదని, ఈ ప్రాంత ప్రజలపై వైసీపీ నాయకులకు కూడా ఎలాంటి ప్రేమ లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు.
సోమశీల ప్రాజెక్టు దెబ్బతిందని తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు ఆకస్మికంగా ఇక్కడికి వచ్చి సోమశీల ప్రాజెక్టును పరిశీలించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు. గతంలో జగన్ లాగా పోలీసు బలగాలతో, పరదాలు కట్టుకుని, కనపడిన చెట్లు కొట్టేసి సోమశీల ప్రాజెక్టు పరిశీలించడానికి రాలేదని వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.

దెబ్బతిన్న సోమశీల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు పరిశీలించారని, త్వరలో ఆ ప్రాజెక్టు మరమ్మత్తులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేశారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు తీసుకు వెళ్లే ప్రణాళిక ఉందని త్వరలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి, నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని, జగన్ గతంలో పరదాలు వేసుకుని తిరిగిన ముఖ్యమంత్రిగా రికార్డు బ్రేక్ చేశారని, అందుకే ప్రజలు జగన్ ను పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు అని మంత్రి ఆనం రామరానాయణ రెడ్డి విమర్శించారు. సోమశీల ప్రాజెక్టు రాళ్లపాడు ప్రాజెక్టు మరమ్మతులకు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబుకు విజన్ ఉందని, జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటులేదని మంత్రి ఆనం వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications