జల జగడం .. వైఎస్సార్ పైన కూడా.. తెలంగాణా మంత్రుల విజ్ఞత అది : మంత్రి అనిల్ ధ్వజం
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాల నేపథ్యంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోమారు తెలంగాణ మంత్రుల వ్యవహారశైలిపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఉభయ రాష్ట్రాల మధ్య నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్న సమయంలో తెలంగాణ మంత్రులు ఇష్టమొచ్చినట్టు, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏమాత్రం బాగోలేదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Recommended Video

తెలంగాణా ప్రభుత్వ వ్యవహార శైలిపై మంత్రి అనిల్ ఫైర్
తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తోందని, తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా అనిల్ కుమార్ యాదవ్ విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే నీటి వాటా తీసుకుంటున్నామని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తమ ప్రభుత్వానికి ఉన్న హక్కు తాము ఉపయోగించుకుంటున్నామని స్పష్టం చేశారు.నీటి విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలు నోరు విప్పడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాయలసీమ తో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

వైఎస్సార్ పైన కూడా నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు .. తెలంగాణా మంత్రుల విజ్ఞత అది
ఇక దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పై కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ మాటలను తెలంగాణ మంత్రుల విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. జగన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని, తమకు కూడా వ్యాఖ్యలు చేయడం వచ్చని పేర్కొన్న మంత్రి అనిల్ సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకుందాం అని సీఎం జగన్ చెప్పారని, అందుకే తాము తెలంగాణ మంత్రుల్లా మాట్లాడడం లేదని స్పష్టం చేశారు. ఏపీ హక్కుగా ఎన్ని నీళ్లు వాడుకోవాలో అన్ని నీళ్ళు కచ్చితంగా వాడుకుంటామని తేల్చిచెప్పారు.

అక్రమంగా నీటి ప్రాజెక్ట్ లు నిర్మించలేదని మరోసారి స్పష్టం
అక్రమంగా తాము ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించడం లేదని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఇక టిడిపి రాయలసీమ అభివృద్ధికి దోహదపడే పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుపై మద్దతు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన పాలమూరు డిండి, కల్వకుర్తి ప్రాజెక్టులను అడ్డుకోలేక పోయిందని నిప్పులు చెరిగారు. రాయలసీమ పట్ల వివక్ష చూపించే వారిగా టిడిపి నాయకులు మారారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అటు టిడిపిని, ఇటు తెలంగాణ మంత్రులను టార్గెట్ చేసి ఫైర్ అయ్యారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications