'వైసీపీ వల్లే గెలిచా', లోకేష్‌పై విజయ్‌ పాత్రుడు

విశాఖపట్నం: ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరో సంచలన వ్యాఖ్య చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయం తీసుకుని విజయం సాధించానన్నారు. తన సొంత నియోజక వర్గం నర్సీపట్నంలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గడచిన ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే తనకు వెన్నుపోటు పొడిచేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. మూడు రోజుల్లో ఎన్నికలున్నప్పుడు విషయం తెలుసుకుని, అప్పటికప్పుడు విజయం కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సహాయం అడిగానని చెప్పారు.

తాను అడిగిన వెంటనే సహాయం చేసి తనను గెలిపించిన ప్రతిపక్ష నేతలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవించాలని కోరారు. ఈ మేరకు కార్యకర్తలు నడుచుకోని పక్షంలో తానే విపక్ష సభ్యులను గౌరవించడం మొదలు పెడతానని ఆయన అన్నారు.

Minister ayyanna patrudu says i took ysrcp help for winning

లోకేష్‌ను తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించండి: విజయ్‌పాత్రుడు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే పార్టీ సభ్యత్వ నమోదును 50 లక్షలు దాటించి రికార్డు సృష్టించిన ఆయన కార్యకర్తల సంక్షేమ యాత్తలో తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ పాత్రుడు ఆదివారం ఓ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నారా లోకేష్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చాడు. యువతతో కలిసి తామంతా లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+