హోదా సాధించే సత్తా సీఎంకే,వైసీపీకి ఇంగితం లేదు:మంత్రి అఖిల ప్రియ

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఎపి పర్యాటక శాఖా మంత్రి అఖిల ప్రియ వైసిపిపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

  నంద్యాల కేబుల్ టీవిలో మంత్రి భూమా అఖిలప్రియ,ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి వార్తలు నిలిపివేత

  ఏపీకి ప్రత్యేక హోదా సాధించే సత్తా ఒక్క సీఎం చంద్రబాబు కే ఉందని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ ఈ సందర్భంగా చెప్పారు. అందుకే ఆంధ్ర ప్రజానీకం అంతా ఆయన అడుగుజాడల్లో ఉద్యమిస్తోందన్నారు. తామంతా ఇక జిల్లాల్లో ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అఖిల ప్రియ చెప్పారు.

  రోజాలో...మార్పు రాదు

  రోజాలో...మార్పు రాదు

  టిడిపి నేతలపై వైసిపి మహిళా నేత రోజా వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ ఇక రోజాలో పరివర్తన అనేది రాదన్నారు. అలాగే వైసీపీకి ఇసుమంతైనా ఇంగితం లేదని...అందుకే ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు.

  ప్రధాని కాళ్లపై పడి...వేడుకుంటున్నారు...

  ప్రధాని కాళ్లపై పడి...వేడుకుంటున్నారు...

  వైసిపి ముఖ్య నేతలు కేసుల మాఫీకి ప్రధాని కాళ్ళపై పడి వైసీపీ నాయకులు ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతుంటే...ఏడాది సస్పెండ్ చేసినా రోజా నోటి దురుసు ఇంకా తగ్గించకుండా, వైసీపీని మరింత బజారుకు ఈడుస్తున్నారని విమర్శించారు.

  దళితులపై...దాడి ఖండించలేదు

  దళితులపై...దాడి ఖండించలేదు

  బీజేపీ ఎమ్మెల్యే ఒక దళితురాలిపై అత్యాచారం చేసిన ఘటనను ఖండించలేని రోజా, ఇక్కడ దళితులపై ఏదో అకృత్యాలు జరుగుతున్నట్లు అభూత కల్పనలు సృష్టిస్తోందన్నారు.
  ఎస్సీ సబ్ ప్లాన్ తో దళితుల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి చేస్తుంటే, స్కాలర్‌షిప్పులు, విదేశాలలో చదువులకు రుణాలతో దళితులు బాగుపడటం వైసీపీ సహించలేక పోతోందన్నారు.

   బెల్టు షాపుల...తోలు తీసింది

  బెల్టు షాపుల...తోలు తీసింది

  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పదిరెట్లు పెరిగిన ఎక్సైజ్ ఆదాయాన్ని టీడీపీ ప్రభుత్వం అదుపు చేసిందని, అలాగే బెల్ట్ షాపుల తోలు తీసింది సీఎం చంద్రబాబే అని మంత్రి అఖిల ప్రియ చెప్పారు. అసలు మీకు మోదీ అంటే భయం...అందుకే దూరంగా ఎక్కడెక్కడో దీక్షలు చేస్తారు...నేరుగా మోదీ ఇంటి వద్దే నిరసన తెలిపిన టీడీపీ ఎంపీలు హోదాపై పోరును పతాక స్థాయికి తీసుకుని వెళ్ళారని మంత్రి అఖిల ప్రియ టిడిపి నేతల పోరాటాన్ని కొనియాడారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  AP minister Bhuma Akhila Priya has fire on YCP leaders. She spoke to the media in her chamber at AP Secretariat.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి