నంద్యాలలో అనుకుంటున్నాం కానీ, ఇంకా నిర్ణయం తీసుకోలేదు: అఖిలప్రియ పెళ్లిపై మేనమామ
Recommended Video

హైదరాబాద్/కర్నూలు: ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు మద్దూరు భార్గవ్‌తో శనివారం హైదరాబాదులోని మంత్రి నివాసంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఇరువురి బంధువుల సమక్షంలో లగ్నపత్రిక రాసుకున్నారు. ఆగస్టు 29న పెళ్లి పెట్టుకున్న విషయం తెలిసిందే.
పెళ్లి విషయమై అఖిలప్రియ మేనమామ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆగస్టులో పెళ్లి పెట్టుకున్నామని చెప్పారు. పెళ్లి వేడుకలు ఆళ్లగడ్డలో నిర్వహించే ఆలోచనలో ఉన్నామని, కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

వరుడు భార్గవ్‌కు పాఠశాలలు, పలు వ్యాపారాలు
నిశ్చితార్థ వేడుకలో ఎస్వీ మోహన్ రెడ్డితో పాటు అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే, సోదరుడు భూమా బ్రహ్మానంద రెడ్డి తదితరులు ఉన్నారు. వరుడు భార్గవ్‌కు పాఠశాలలతో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి.

వ్యక్తిగత కారణాలతో విడిపోయారు
అఖిలప్రియకు ఇదివరకు వైయస్ రాజశేఖర రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి నరేన్ రామాంజనేయ రెడ్డితో పెళ్లయింది. ఏడాది తర్వాత విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. భార్గవ రెడ్డికి కూడా గతంలో పెళ్లయి విడాకులు తీసుకున్నారు. వ్యక్తిగత కారణంగా విడిపోయారు. భార్గవ్, అఖిల ప్రియ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్యే నిశ్చితార్థం
అఖిలప్రియ, భార్గవ్‌ల నిశ్చితార్థం శనివారం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది. భార్గవ్ మాజీ డీజీపీ సాంబశివ రావు అల్లుడే కాకుండా, మంత్రి నారాయణ పెద్ద అళ్లుడు పునీత్ పిన్ని కొడుకు అని కూడా చెబుతున్నారు.

భూమా అఖిలప్రియ
కాగా, భూమా అఖిలప్రియ 2014లో తల్లి శోభా నాగిరెడ్డి మృతి అనంతరం రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆళ్లగడ్డ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కొద్ది నెలల క్రితం మంత్రి అయ్యారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications