ద‌మ్ముంటే అసెంబ్లీకి రండి.. రాజ‌దానిపై మాట్లాడు.. క‌డుపు మంట‌తో కాదు..? : చంద్ర‌బాబుకు బొత్స కౌంట‌ర్‌

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మూడు రాజధానుల వ్యవహారం రాజ‌కీయ‌ దుమారం రేపుతోంది. అధికార , విపక్షాల మధ్య మాట యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమైంది. అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై రాష్ట్ర హైకోర్టు తీర్పును ఆయన తప్పుపట్టారు. తన పరిధిని దాటి వ్యవహరిస్తోందని అభిప్రాయపడ్డారు. జగన్ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా విరుచుకుపడింది. హైకోర్టు తీర్పుచెప్పినా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎంకు, మంత్రులకు లేదని దుయ్యబట్టారు.

 అధికారం పోయిందన్న ఆక్రోషంతో బాబు..

అధికారం పోయిందన్న ఆక్రోషంతో బాబు..


చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై చంద్రబాబు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై బయటే ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు. అధికారం పోయిందన్న ఆక్రోషం, కడపు మంటతో చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ సభ్యులు రాజీనామా చేయాల్సి అవసరం లేదన్నారు. రాజధానిపై కావాలంటే టీడీపీ శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నిక‌లకు వెళ్లోచ్చ‌న్నారు. ప్ర‌జాభిప్రాయం కోరితే అప్పుడు ఎవ‌రి స‌త్తా ఏమిటో తెలుస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమ‌రావ‌తి రైతుల‌కు ప్లాట్లు ఇస్తాం..

అమ‌రావ‌తి రైతుల‌కు ప్లాట్లు ఇస్తాం..


ఒప్పందం ప్రకారం అమరావతి రైతులను ప్లాట్లు ఇస్తామని మంత్రి బొత్స స్పస్టం చేశారు. రైతులను ఎలాంటి నష్టం జరగదని తెలిపారు. మిగిలిన ఉన్న 7,300 ఎకరాలు అమ్మితే లక్ష కోట్లు వస్తుందా.? అని చంద్రబాబును ప్రశ్నించారు. తాము ఏ వ్యవస్థపై దాడి చేయలేదని తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే వికేంద్రీకరణ చట్టాలను చేశామని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి లోబడి చట్టాలను ఉండాలని తాము మొదటి నుంచి చెప్తున్నామని తెలిపారు. ఆ చట్టాలను అధిగమించి ఎవరూ ఏమీ చేయరని , రాజ్యాగం ప్రకారం అందరం నడవాల్సిందేనని పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల మంచికోస‌మే వికేంద్రీక‌ర‌ణ‌

ప్ర‌జ‌ల మంచికోస‌మే వికేంద్రీక‌ర‌ణ‌


వ్యవస్థల్లో ఎవరి పాత్ర ఎంతవరకు అన్న దానిపై అసెంబ్లీలో చర్చించామని బొత్స తెలిపారు. ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే శాసనసభలో మాట్లాడవచ్చని సూచించారు. కానీ అందుకు భిన్నంగా కూర్చోని మాట్లాడితే ఎలా అని నిలధీశారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్దంగానే ఉన్నాయన్నారు. ప్రజల మంచి కోసం చేసే చట్టాల్లో ఎవరూ జోక్యం చేసుకోకూడని పేర్కొన్నారు. అమ‌రావ‌తి రైతుల కోస‌మే కాకుండా రాష్ట్ర ప్ర‌జ‌ల ఆనందం కోసం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాలన్న‌ది త‌మ ప్ర‌భుత్వ లక్ష్య‌మన్నారు. అభివృద్ధి వికేందీక‌ర‌ణ‌పై సీఎం జ‌గ‌న్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని బొత్స స్ప‌ష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+