వలంటీర్ల వ్యవస్థ బాధ్యతపై ప్రభుత్వం క్లారిటీ - కొత్త జోనల్ వ్యవస్థ..!!

వాలంటీర్ల వ్యవస్థ బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి బొత్సా తేల్చి చెప్పారు. వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి.. వ్యవస్థకు బాధ్యులెవరని పవన్ ప్రశ్నిస్తున్న సమయంలో మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ వలంటీర్ల వ్యవస్థను కించపరిచారని..ఇష్టానుసారం మాట్లాడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పారు. వాలంటీర్ల నియమాకంలో ఆచితూచి వ్యవహరించామని..ఇబ్బందులు వస్తే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేసారు.

ప్రభుత్వానిదే బాధ్యత:ప్రభుత్వంలో ఉన్న వాళ్లు తప్పు చేస్తే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని మంత్రి బొత్సా వ్యాఖ్యానించారు. ఇది పూర్తి రాజ్యంగబద్దంగా జరుగుతున్న వ్యవస్థగా వివరించారు. ఎమ్మార్వో..పోలీసు అధికారి తప్పు చేస్తే ఆ వ్యక్తులను దూషించటం లేదు కదా అని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేస్తే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందన్నారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని అంటున్నారని...ప్రజలు బందిపోటు దొంగలా.. దోపిడీ దారులా అని బొత్సా నిలదీసారు. సంక్షేమ పథకాల అమలు కోసమే వివరాలు తీసుకుంటున్నారని వివరించారు. డేటా ఏ సందర్భంలో దుర్వినియోగమైందో చెప్పొచ్చని సూచించారు.

Minister Botsa clarified that Govt Will take over Volunteer system Responsibilites

ఎవరిని బెదిరిస్తున్నారు:కేంద్ర ప్రభుత్వంతో జనసేన అధినేత పవన్ సంబంధం పెట్టుకుంటే ఎవరికి కావాలని వ్యాఖ్యానించారు. కేంద్రం కాకపోతే అమెరికా అధ్యక్షుడుతో అయినా సంబంధం పెట్టుకోవచ్చన్నారు. తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం బెదరదని స్పష్టం చేసారు. కేంద్రంతో పరిచయాలు ఉన్నాయంటూ పవన్ ఎవరిని బెదిరిస్తున్నారని బొత్సా నిలదీసారు. సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తామని.. వలంటీర్ల వ్యవస్ధను రద్దు చేస్తామని చెప్పాలని సవాల్ చేసారు. రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుపైన చర్చించామని బొత్సా వెల్లడించారు. ఏ జిల్లాలను ఏ జోన్ పరిధిలోకి తీసుకురావాలని చర్చించామన్నారు.

జోనల్ వ్యవస్థ ఏర్పాటు:ఉద్యోగులతో చర్చించిన తరువాత జోనల్ వ్యవస్థను నిర్ణయిస్తామని ప్రకటించారు. చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలోని సభ్యులకు ఉద్యోగాలిచ్చే కారుణ్య నియామకాల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని స్పష్టం చేసారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై గడువు తేదీ మార్చటం పైన ఆలోచన చేస్తున్నామని బొత్సా వెల్లడించారు. క్రమబద్దీకరణపై మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆగస్టు 7న జారీ చేస్తామనిమంత్రి బొత్సా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+