జగన్ పై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యల వెనుక - ఇదీ జరిగిందీ..!!

ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సస్ వైసీపీ మధ్య ఎన్నికల యుద్దం నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. ఈ సమయంలో గతంలో జగన్ కోసం పని చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జగన్ గెలుపుకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారు. దీని పైన మంత్రి బొత్సా స్పందించారు. పీకే వ్యాఖ్యల వెనుక విషయాలను వెల్లడించారు.

ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే)పై మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని మండి పడ్డారు. లీడర్‌ అంటే ప్రజల దృష్టిలో వైఎస్‌ జగన్‌ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు. ప్రశాంత్‌ కిషోర్‌ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. లీడర్‌కు, ప్రొవైడర్‌కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ గా చెప్పుకొచ్చారు. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకుని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Minister Botsa reacts over Strategist prasanth Kishor comments on Jagan Administration

సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాలతో ఏపీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని బొత్సా చెప్పారు. ఆ నిర్ణయాలతోనే విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు. గత ఐదేళ్లలో సీఎం జగన్‌ నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో కూడా ముందుందని వివరించారు. జీడీపీలో ఏపీ నాలుగో స్థానంలో వుందని చెప్పారు. నీతి అయోగ్ విశ్లేషణలు .. పీఎం అడ్వైజరీ కమిటీ నివేదికల్లోనూ ఏపీ ముందుందని బొత్సా వివరించారు. గతంలో 16, 15 స్థానాల్లో ఉన్న ఏపీ.. ఇప్పుడు నాలుగైదు స్థానాల్లో నిలుస్తోందన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న సంస్కరణలతోనే ఈ అభివృద్ధి అంతా సాధ్యమైందని విశ్లేషించారు. బీహార్ లో ప్రజలు ఎందుకు పీకేను వెనక్కు పంపారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన పై పీకే ఎందుకు మాట్లాడటం లేదని బొత్సా నిలదీసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+