పవన్ కల్యాణ్ కు మంత్రి బొత్సా అసైన్‌మెంట్స్ - ట్యూషన్ తీసుకుంటా..!!

ఏపీలో పవన్ వర్సస్ వైసీపీ రాజకీయ యుద్దం పీక్ కు చేరింది. విద్యా వ్యవస్థపైన తాజాగా పవన్ చేసిన విమర్శలకు మంత్రి బొత్సా కౌంటర్ ఇఛ్చారు. తాను ఈ రోజు నుండి పవన్‌ కళ్యాణ్‌ వద్ద ట్యూషన్‌ తీసుకుంటాను.. కానీ ఒక షరతు విధించారు. పవన్ ముందు తెలుసుకోవాల్సిన అంశాలు..హోం వర్క్ చేయాల్సిన విషయాలంటూ వరుస ట్వీట్లు చేసారు. ఏడు అంశాలను వివరించారు. వాటిని క్షుణ్ణంగా చదవటమే అసైన్ మెంట్ గా పేర్కొన్నారు.

పవన్ కు సమాధానంగా మంత్రి బొత్సా ట్వీట్లు చేసారు. అందులో పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ టెండర్‌లకు సంబంధించినంత వరకూ అర్హత లేదా పరిధిని నిర్ణయించే అధికారాన్ని అందించిన ప్రపంచంలోని ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని తెలుసుకోవాలని సూచించారు. రూ. 100 కోట్లకు పైబడిన ఏదైనా ప్రభుత్వ టెండర్ యొక్క పరిధిని మరియు అర్హతను ఖరారు చేయడం హైకోర్టు సమ్మతితో నియమించబడిన ప్రత్యేక న్యాయమూర్తి ( జస్టిస్ శివశంకర్ రావు) చేత ఫైనలైజ్‌ అవుతుందని చెప్పుకొచ్చారు. టెండర్ స్పెసిఫికేషన్‌లు పబ్లిక్ డొమైన్‌లో ఉంచుతామని చెప్పారు. అదే సమయంలో వాటిపై ప్రతిస్పందించడానికి 21 రోజుల సమయం ఇస్తారని చెప్పుకొచ్చారు.

botsacomentsonpawankalyan

ఆపై ఇందుకోసం నియమించిన న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాత టెండర్‌ స్పెసిఫికేషన్‌ అనేది లాక్‌ చేస్తారని వివరించారు. టెండర్ల స్పెసిఫికేషన్‌లో ప్రపంచంలో న్యాయపరమైన సమీక్ష కల్గిన ఏకైక ప్రభుత్వం మాది అని గొప్పగా చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నామన్నారు. ఈ తరహా విధానం వలన కంపెనీలకు సమ న్యాయం జరగడమే కాకుండా అవి సక్సెస్‌ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందని బొత్సా వివరించారు. అలాగే, ప్రాథమిక గూగుల్ సెర్చ్‌ అనేది మీకు ఈ నిర్దిష్ట టెండర్ కోసం ప్రభుత్వంతో నిమగ్నమై ఉన్న అన్ని కంపెనీల వివరాలను అందిస్తుంది (ఆగస్టు 2022 నుండి పబ్లిక్ డొమైన్‌లో ఉంది!) కానీ లింక్‌ను మళ్లీ ఇవ్వడం వల్ల దాన్ని మీరు మళ్లీ మిస్‌ అయ్యే అవకాశం ఉండదని పేర్కొన్నారు.

ఏపపీ విద్యా రంగానికి సంబంధించినంతవరకు, ప్రతి ఒక్కరూ చూడగలిగేలా ఫలితాలు వెలువడే అత్యంత పారదర్శకమైన విభాగం మాది అని చెప్పుకోవడానికి మేము గర్విస్తున్నామని బొత్సా ట్వీట్ లో స్పష్టం చేసారు. ప్రతీసారి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని చూసి మీకు పాఠాలు చెప్పిన టీచర్లు సిగ్గుపడటం ఖాయం. అది చూసి నాకు కూడా జాలేస్తోందని వ్యాఖ్యానించారు. మీ మెదడులో పదును పెంచేందుకు నేను ప్రత్యామ్నాయ ట్యూషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ బొత్సా పవన్ ను ఉద్దేశించి పోస్టు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+