ఎన్నికల వేళ తెర మీదకు ఏపీకి ప్రత్యేక హోదా - కలిసొచ్చేనా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. సీఎం జగన్ చేస్తున్న అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. అటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా మేనిఫెస్టో రూపకల్పన పైన కసరత్తు చేస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ తిరిగి ఏపీలో పుంజుకొనే వ్యహాల పైన ఫోకస్ పెడుతోంది. ఈ సమయంలోనే ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరో సారి తెర మీదకు వస్తోంది. దీంతో, ఈ ఇప్పుడు అంశం ఏ మేర ఎన్నికల్లో గెలుపు ఓటమలును ప్రభావితం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

ఏపీకి హోదా పై
ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరోసారి ఎన్నికల వేళ చర్చగా మారింది. కొత్త పార్టీ ప్రారంభించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనవరి 26న ప్రత్యేక హోదా నినాదంతో కార్యాచరణ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హోదా స్థానంలో ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి నష్టం చేసారని ఆరోపించారు. స్వచ్చంద సంస్థలు హోదా నినాదంతో ఉద్యమానికి సిద్దం అవుతున్నాయి. అటు చంద్రబాబు సైతం తన సభల్లో నాడు 2019 ఎన్నికల సమయంలో జగన్ ప్రత్యేక హోదా కోసం చెప్పిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. ఇటు బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు కోసం ప్రయత్నిస్తున్న వేళ హోదా అంశం పైన తాజాగా వైసీపీ నేతలు నాటి చంద్రబాబు ప్యాకేజీ అంశాన్ని గుర్తు చేస్తున్నారు.

Minister Buggana made interesting comments over Special Stauts for Andhra Pradesh

మరో సారి తెర మీదకు
ఇప్పుడు ఈ హోదా అంశం ఎన్నికల్లో ఏ మేర ప్రబావితం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన హోదా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వంలో 22 శాతం అప్పు పెరిగిందన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో 12 శాతం మాత్రమే, వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలో ఖర్చు చేసే ప్రతీ రూపాయికి లెక్క ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఏ ఆధారాలతో ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అప్పులపై నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర విభజనకు, విభజన తరువాత ప్రత్యేక హోదా కోల్పోవడానికి కూడా చంద్రబాబే ప్రధాన కారణమన్నారు.

చంద్రబాబే కారణం
రాష్ట్ర విభజనపై చంద్రబాబు అనేక సార్లు మాట మార్చారని బుగ్గన ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులకు చంద్రబాబు కారణం కాదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు కాదా అంటూ నిలదీసారు. ప్రత్యేక హోదా వదిలేసి ప్యాకేజీకి చంద్రబాబు ఎందుకు ఒప్పుకున్నారని బుగ్గన పేర్కొన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ విడిపోవడం వల్ల 1.80 లక్షల కోట్ల రెవెన్యూ ఏపీకి రాకుండా పోయిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి వివరించారు. ప్రస్తుతం ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు చంద్రబాబు మాటలు వింటున్నారన్నారు. కానీ గతంలో ఆయన వారి గురించి చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయా అని మంత్రి ప్రశ్నించారు.ఇక, ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్ హోదా అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా మలచుకోవాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+