చంద్రబాబుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!
Minister Chelluboina Venu Gopala Krishna, Chandra Babu, Lokesh, EAst Godavari, మంత్రి చెల్లుబోయిన, చంద్రబాబు, లోకేష్, తూర్పు గోదావరి
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సైకోలా ప్రవర్తిస్తున్నారని..మతిస్థిమితం తప్పిందని విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే మాత్రం కుదరని స్పష్టం చేసారు.
సైకోలు ఎలా ప్రవర్తిస్తారో నిన్న చంద్రబాబు పర్యటనలో చూశామని చెప్పుకొచ్చారు. ఆ విషయం ప్రజలకూ అర్థమైందన్నారు. కొడుకు పాదయాత్ర ఎక్కడా ప్రజాదరణ లేక ఘోరంగా విఫలమైందన్నారు. దీంతో..చంద్రబాబుకు మానసిక క్షోభకు గురవుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దిక్కు తోచని చంద్రబాబు చట్టాలను గౌరవించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబుకు వయసు మీద పడి.. మతి భ్రమించిందని ఎద్దేవా చేసారు. అందుకే చట్టాలను అతిక్రమిస్తూ సైకోలా మారారంటూ వ్యాఖ్యానించారు. చివరకు తనకు రక్షణ కల్పించే పోలీసులనూ గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. పోలీసులను వారిని నిందిస్తున్నారని.. చట్టాలు అతిక్రమిస్తున్న చంద్రబాబు ఒక సంఘ విద్రోహిలా మారుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

నడిరోడ్డు మీద బహిరంగ సభకు సిద్ధమైన చంద్రబాబును పోలీసులు నిలవరించే ప్రయత్నం చేసారన్నారు. ప్రజల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. 2014 ఎన్నికల మందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నీ 5 ఏళ్ల పాలనలో నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో మూడున్నర ఏళ్లలోనే 99 శాతం అమలు చేశారన్నారు. అలా ఒక నాయకుడు ఎలా ఉండాలన్నది చూపారని చెప్పుకొచ్చారు.

మాట తప్పడం, మడమ తిప్పడం చంద్రబాబుకు అలవాటుగా పేర్కొన్నారు. ప్రజల ప్రాణ రక్షణ ప్రభుత్వ బాధ్యతని మంత్రి స్పష్టం చేసారు. చంద్రబాబు రోడ్లపై సభలు పెట్టి ప్రజల ప్రాణాలు తీస్తే.. వారి భద్రత కోసం ప్రభుత్వం జీఓ నెం.1 జారీ చేసిందని చెప్పుకొచ్చారు. సహాయ నిరాకరణ అంటున్నావంటే, నీవెంత కంగారు పడుతున్నావన్న విషయం అర్ధమవుతోందిని మంత్రి చెల్లుబోయిన పేర్కొన్నారు. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీ ఆరోపించిన విషయాన్ని మంత్రి గుర్తు చేసారు.












Click it and Unblock the Notifications