పతివ్రత అవతారం ఎత్తాడే?
యనమలకు దమ్ముంటే.. తమ్ముడు ద్వారా తుని ప్రజల నుంచి దోచేసిన సొమ్ములను తిరిగిప్పించాలని దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు
మంత్రి దాడిశెట్టి రాజా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యనమల అనే వాడు పతివ్రత అవతారం ఎత్తాడని.. తాను పతివ్రతని అని చెప్పుకుంటూ, తన తమ్ముడు కృష్ణుడు వెధవన్నర వెధవ అని చెప్పుకుంటున్నాడంటూ మండిపడ్డారు. 40 సంవత్సరాలుగా అన్న యనమల డైరెక్షన్‌లో తమ్ముడు కృష్ణుడు తుని నియోజకవర్గంలో ప్రజలను పీడించుకుతిన్నాడని, తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై ఏ కేసు పెట్టాలని కృష్ణుడు అడిగితే.. అట్రాసిటీ కేసు పెట్టమని రామకృష్ణుడు చెప్పాడనే విషయాన్ని రాజా వెల్లడించారు.
తునిలో ఎంతోమంది విలువైన ప్రాణాలను తీసేసి, వారి ఆస్తుల్ని కృష్ణుడు అపహరించాడని, యనమలకు దమ్ముంటే.. తమ్ముడు ద్వారా తుని ప్రజల నుంచి దోచేసిన సొమ్ములను తిరిగిప్పించాలని సవాల్ విసిరారు. అప్పుడు పతివ్రతను అని చెప్పమనండి అన్నారు. ఇదే సమయంలో మంత్రి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై పరోక్షంగా కౌంటర్లు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు కొత్త నాటకానికి తెర లేపారని వ్యాఖ్యానించారు. తప్పులు మొత్తం వారు చేసి జగన్ పై బురద జల్లుతున్నారని, ఇప్పుడు పార్టీని వీడిపోతున్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవరని తాను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని కష్టాల్లో వదిలి 23 మంది వెళ్లిపోయారని, వారికి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా యనమల రామకృష్ణుడు కేవలం రెండు నియోజకవర్గాల కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో తన వెనుక తిరిగిన వెంకటేష్ రూ.4 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని చెప్పారు. అప్పుడు చేయని తప్పుని తన మీద వేసుకొని మొత్తాన్ని భరించానని.. ఇప్పుడు యనమల అలాగే తన తమ్ముడి తప్పుని ఒప్పుకోగలరా? అన్నారు. తనకు సంబంధం లేకున్నా.. టీడీపీ నాయకులు గతంలో రైలు దహనం కేసులో తనని అన్యాయంగా ఇరికించారని, అనేక కేసులుపెట్టి ఎంతగానో వేధించారని మంత్రి దాడివెట్టి రాజా ఆవేదన వ్యక్తం చేశారు












Click it and Unblock the Notifications