మంత్రి దేవినేని ఉమ కారుకు సడెన్ బ్రేక్, తప్పిన పెను ప్రమాదం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు పెను ప్రమాదం తప్పింది. ఆయన బెంగళూరు నుంచి అనంతపురానికి వస్తుండగా ఇది చోటు చేసుకుంది.
ఆయన కాన్వాయ్ అనంతకు వస్తుండగా కోన వద్ద హంద్రీనీవా కాలువను చూడాలని, కారు ఆపాలని దేవినేని తన డ్రైవర్‌కు సూచించారు. దీంతో ఒక్కసారిగా కారు నిలపడంతో కాన్వాయ్‌లోని మరో కారు వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది.

Recommended Video

లేఖలో ఏముందో చూసుకోకుండా సంతకం, ఇదీ జగన్ అంటే
ఈ కాన్వాయ్ ప్రమాదంలో మంత్రి దేవినేని, డ్రైవర్, ఇతరులు సురక్షితంగా బయటపడ్డారు. సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications