విశాఖను కొత్త రాష్ట్రంగా ప్రకటించాలి - ఏపీ మంత్రి డిమాండ్ : టీడీపీకి సంకేతాలు..!!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇటు ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని చెబుతోంది, ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సిఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా చేయాలంటూ అధికార పార్టీ నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అటు కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనే డిమండ్ పెరుగుతోంది. ఇదే సమయంలో కొత్తగా విశాఖను రాజధాని చేయకుంటే రాష్ట్రం చేయాలంటూ మంత్రులే డిమాండ్లు మొదలు పెట్టారు.

రాజధాని కాకపోతే రాష్ట్రంగా ప్రకటించాలి
విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటకే విశాఖ గర్జన పేరుతో సభ నిర్వహించారు. వైసీపీ మూడు రాజధానులను చేస్తామని చెబుతుంటే..ప్రతిపక్షాలు అమరావతి మాత్రమే రాజధాని అని చెబుతున్నాయి. తొలి నుంచి ఉత్తరాంధ్ర వెనుకబటు తనం గురించి అసెంబ్లీ లో..బయటా మంత్రి ధర్మాన పదే పదే ప్రస్తావిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం ప్రకటన సమయంలోనూ ఉత్తరాంధ్ర కు రాజధాని ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా డిమండ్ చేసారు. ఆ తరువాత విశాఖ రాజధాని కోరుతూ మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి వెళ్తానంటూ సీఎంను కలిసారు. ముఖ్యమంత్రి సూచనతో వెనుకడగుడు వేసారు. ఇప్పుడు ధర్మాన కొత్త డిమాండ్ తెర మీదకు తెచ్చారు. విశాఖను రాజధాని కాకపోతే రాష్ట్రంగా ప్రకటించాలని సంచలన డిమాండ్ తెర పైకి తెచ్చారు.
టీడీపీకి సంకేతాలు ఇస్తున్నారా..
వైసీపీ ప్రభుత్వం తొలి నుంచి రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదనే మూడు రాజధానుల నిర్ణయమని చెబుతూ వస్తోంది. ప్రాంతీయ ఉద్యమాలు రాకూడదనే మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులను వివరించే ప్రయత్నం చేస్తోంది. టీడీపీతో సహా ప్రతిపక్షాలు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇక, ఎన్నికలకు సిద్దం అవుతున్న సమయంలో కేబినెట్ మంత్రి విశాఖ రాజధాని కాకపోతే రాష్ట్రంగా ప్రకటించాలంటూ చేసిన డిమాండ్ పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పుడు మూడు రాజధానులను వ్యతిరేకిస్తే భవిష్యత్ లో కొత్త రాష్ట్రాల డిమాండ్లు తెర మీదకు వస్తాయనే సంకేతాలు టీడీపీకి ఇచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేసారా అనే చర్చ మొదలైంది. ఇక, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న రాజధానుల వ్యవహారం జనవరి నెలాఖరులో తీర్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

విశాఖ నుంచే జగన్ పాలన
విశాఖ నుంచి పాలన ప్రారంభించే దిశగా ప్రభుత్వంలో అడుగులు పడుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖలో పాలన ప్రారంభం అవుతుందని ఇప్పటికే మంత్రి అమర్నాధ్ ప్రకటించారు. సుప్రీంకోర్టులో తీర్పు మరో నెల రోజుల్లో వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం ఉంటే..అధికారికంగా విశాఖ నుంచి పాలన ప్రారంభం కానుంది. కోర్టులో తీర్పు ఆలస్యం అయితే ముందుగా ముఖ్యమంత్రి విశాఖలో క్యాంపు కార్యాలయం నుంచి తన పాలన ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇందుకు ఉగాది ముహూర్తంగా ఖరారు చేసారు. విశాఖలోనే మంత్రి వర్గ సామావేశాలు ఏర్పాటు చేయనున్నారు. సచివాలయం విశాఖ తరలింపు విషయంలో న్యాయ పరంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications