శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ కు మంత్రి ధర్మాన రాజీనామా లేఖ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా.. ఉద్యమంలోకి రావాలని ఉందని..మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కొద్ది రోజుల క్రితం మంత్రి ధర్మాన ప్రకటించారు. విశాఖ గర్జన..తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి ధర్మాన ఇప్పుడు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తన లేఖను అందించారు. తనకు వైఎస్సార్ తో ఉన్న అనుబంధాన్ని అందులో వివరించారు.

అమరావతి పేరుతో ఒక ప్రాంతానికే మొత్తం సంపదను తరలిస్తూ.. అక్కడే మొత్తం అభివృద్ధి కేంద్రీకరించేలా తీసుకున్న నిర్ణయాన్ని అందులో వివరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేయాలనే సంకల్పంతో నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. కానీ ,కొన్ని పార్టీలు కుటిల ప్రయత్నాలు చేస్తూ ఈ మూడు రాజధానుల నిర్ణయం అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. వికేంద్రీకరణ - అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్ కు తారకమంత్రిగా మంత్రి ధర్మాన అభివర్ణించారు. అమరావతిని అంత భారీ ఖర్చు చేస్తే మరో హైదరాబాద్ గా మారుతుందని.. ఇతర ప్రాంతాల వారికి అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

Minister Dharmana resignation letter to CM Jagan, Whats the CM Decision, Check here

దీంతో..ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల మేరకు తాను ప్రజలతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని భావిస్తున్నానని వివరించారు. ఇందు కోసం రాష్ట్ర మంత్రిగా తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ, సీఎం జగన్ తన లక్ష్యం ఏంటో వివరించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు పంచుతూ వికేంద్రీకరణ చేయటమే ప్రభుత్వ విధానమని మంత్రి ధర్మానకు సీఎం జగన్ స్పష్టం చేసారు. ఖచ్చితంగా మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి పదవికి రాజీనామా అవసరం లేదని వారించారు. అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పుడు ధర్మాన రాజీనామాకు సిద్దమయ్యారానే సమాచారం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది.

English summary
Minister Dharmana asked CM to permit him for Resingation in favour of three capitals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X