Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్లో రావాల్సిందే: గంటా, బీజేపీలో 'సీమ' చిచ్చు

హైదరాబాద్: వరంగల్ నిట్‌లో తమ రాష్ట్ర విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు బుధవారం చెప్పారు. వరంగల్ నిట్ సీట్ల విషయంలో ఏపీకి న్యాయంగా రావాల్సిన దానిని దక్కించుకుంటామన్నారు.

కేంద్ర హెచ్ఆర్డీ వద్ద తగవును తేల్చుకందామని గంటా చెప్పారు. నిట్‌ సీట్ల విషయంలో తాము కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. ఏపీకి కేంద్రం నిట్‌ కేటాయించినా ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తమకు సీట్లు తగ్గాయన్నారు. రెండు రాష్ట్రాల్లో నిట్‌లలో ఎపీ, తెలంగాణలకు చెరో యాభై శాతం రావాల్సిందే అన్నారు.

అందుకే, వరంగల్‌ నిట్‌లో తమ రాష్ట్ర విద్యార్థులకు కొన్ని సీట్లు కేటాయించాలని తాము కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. మరోవైపు, భోగాపురంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై విజయనగరం, విశాఖ జిల్లాల అధికారులతో మంత్రి చర్చించారు.

Minister Ganta responds on Warangal NIIT seats

అనంతరం మంత్రి మాట్లాడారు. విమానాశ్రయం నిర్మాణంపై రిట్‌ అనే సంస్థ సర్వే చేస్తుందన్నారు. నివేదిక వచ్చాక ఎయిర్‌పోర్టుకు ఎంత భూమి కావాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒత్తిళ్లకు, ఉద్యమాలకు తలొగ్గే సమస్య లేదన్నారు.

ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు: చినరాజప్ప

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పెద్ద తలకాయలు ఉన్నాయని డిప్యూటీ సీఎం చినరాజప్ప అన్నారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.

ఏపీ బీజేపీలో ఎమ్మెల్సీ ముసలం

ఏపీ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికలతో ముసలం ఏర్పడింది. బీజేపీ పక్ష ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ ప్రకటించింది. దీంతో బీజేపీ నేతలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సీనియర్‌ నేత రామచంద్రా రెడ్డిని కాదని సోము వీర్రాజుకు ఇవ్వడంపై కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర నుంచి ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నందున ఎమ్మెల్సీ పదవిని రాయలసీమకే ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+