ప్రభుత్వం గుడ్ న్యూస్ - 134 రకాల ఉచిత వైద్య పరీక్షలు..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ప్రారంభించిన టీ-డయాగ్నొస్టిక్స్‌లో 134 వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఈ సెంటర్లలో 134 పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. అదే విధంగా వాటి రిపోర్టులను రిపోర్టులను పేషెంట్, డాక్టర్ల సెల్ ఫోన్‌కు పంపిస్తారు. 31 జిల్లాల్లో ఈ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పరీక్ష కేంద్రాలు..రేడియాలజీ సెంటర్లు తెలంగాణలో ప్రారంభించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 134 ఫ్రీ మెడికల్ టెస్టులు తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వైద్య పరీక్షలను మినిస్టర్ హరీశ్‌రావు వర్చువల్‌గా స్టార్ట్ చేశారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. తాజాగా 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. అన్ని పీహెచ్‌సీల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని తెలిపారు.

తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ద్వారా ఇప్పటివరకు 54 పరిక్షలు ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 134కి పెరిగింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో టీ-డయాగ్నొస్టిక్స్ కేంద్రాలు, రేడియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. మరో రెండు జిల్లాల్లో పనులు జరుగుతున్నాయని, త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తామన్నారు. కరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, ప్రజలను మహమ్మారిబారినుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయి ఆస్పత్రులకు దీటుగా మార్చి.. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చారని అభినందించారు. పేద ప్రజలకు నిమ్స్‌లో అత్యాధునిక వైద్యం అందిస్తున్నట్లు వివరించారు.












Click it and Unblock the Notifications