పవన్ ది సూపర్ డూపర్ ప్లాప్ షో - మంత్రి జోగి రమేష్..!!

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర పెడ‌న‌లో అట్ట‌ర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయింద‌ని పేర్కొన్నారు. పవన్ సభకు రెండు వేల మంది కూడా రాలేదని విమర్శించారు. అవనిగడ్డలో పవన్ ఫ్లాప్ షో.. పెడనలో సూపర్ డూపర్ ప్లాప్ షో అని దుయ్యబట్టారు. జనసేన - టీడీపీ కలయిక వ్యాక్సిన్ కాదు పాయిజన్ అంటూ వ్యాఖ్యానించారు.

పెడన ప్రజలు శాంతి కాముకులు.. అటువంటి ప్రజలపై ఆరోపణలు చేసినందుకు పవన్ కల్యాణ్‌ క్షమాపణలు చెప్పాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్‌ చేశారు. అత్తారింటికి దారేది సినిమా పైరసీ చేశారనే పేరుతో పెడనలో 30 మందిని అరెస్టు చేసి చిత్రహింసలు చేసిన చరిత్ర పవన్ కల్యాణ్‌ది అని ఆరోపించారు. టీడీపీ, జనసేన కలిసిన తరువాత పెట్టిన మీటింగ్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు.

Minister Jogi Ramesh

ఈ రెండు పార్టీల కలయిక వ్యాక్సిన్‌ కాదని... ఈ కలయిక వైరస్‌ అని ప్రజలు అంటున్నారని చెప్పుకొచ్చారు. 2014లో మీ ఇద్దరి కలయిక, మీ బంధం, మీరు ప్రజలను ఏవిధంగా దగా చేసిందని విమర్శించారు. పెడన లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నారని చెప్పారు. పెడనకు వచ్చిన పవన్‌ ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తన నియోజకవర్గం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు ఉందా అని నిలదీసారు.

పెడన కళంకారీ పరిశ్రమను ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. 2014లో చంద్రబాబు, పవన్‌ కలిసి పోటీ చేశారని.. ఆ తరువాత టీడీపీ నుంచి బయటకు వచ్చి అవినీతి రాజ్యం అని నిప్పులు చెరిగిన పవన్‌కు అసలు విలువలు, విశ్వసనీయత ఉందా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ ప్రజలను ద్రోహం చేసిందని ఆ రోజు ఆరోపించిన పవన్‌..ఇవాళ ఏ ముఖం పెట్టుకుని కలిసిపోయారో చెప్పాలన్నారు.

ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు దారుణంగా హింసిస్తే నోరు మెదపలేదని మండి పడ్డారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి ప్రజల గుండెల్లో సంక్షేమం, అభివృద్ధిగా నిలిచిపోయారని చెప్పుకొచ్చారు. జగనన్న మాకు కావాలి, జగన్న మాకు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు అంటున్నారని మంత్రి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+