మా అన్నను టచ్ చేయలేరు, సీఎం వారిస్తున్నా- జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు..!!
మంత్రి జోగి రమేష్ జనసేనాని పవన్ లక్ష్యాంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఢిల్లీలో విగ్గు రాజుతో కలిసి కంపెనీ పెట్టు.. ఏ పార్టీని ఏ పార్టీతో కలపాలో కంపెనీ పెట్టు అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదలకు అన్నం పెడుతున్నాడు.. గూడు కల్పిస్తున్నాడు.. వైయస్ జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు. పవన్ కల్యాణ్ పెళ్లాలనే కాదు పార్టీలను కూడా మారుస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. జగన్ ను ఎవరూ టచ్ కూడా చేయలేరన్నారు.
పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. పెత్తందారుల కోటలు బద్దలు కొట్టామని చెప్పారు. రాజధానిలో పేదలు నివసించకూడదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ న్యాయపరమైన చిక్కులను అధిగమించి పేదలకు ఇళ్లు ఇస్తున్నారని తెలిపారు. పేదల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం జగన్ అని ప్రశంసించారు. మా సొంతింటి కల నెరవేర్చిన జగనన్నకు రుణపడి ఉంటామన్నారు. సీఎం వైఎస్ జగన్ చరిత్రను తిరగ రాస్తున్నారని మంత్రి జోగి చెప్పుకొచ్చారు.

అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండాలంటే చంద్రబాబు సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అన్నారని చెప్పారు. కానీ, రాజధానిలో సీఎం జగన్ 50 వేల మందికి ఇళ్లు కట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. పెత్తందార్ల పక్కన పేదలు ఉండకూడదని కోర్టుకు వెళ్లిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. చంద్రబాబుపైన ఘాటు వ్యాఖ్యలు చేసారు. లోకేశ్ పాదయాత్రను ప్రస్తావిస్తూ జగన్ తో పోటీనా అని ఫైర్ అయ్యారు. జగన్ ఒక ధీరుడని..ఢిల్లీ కోటనే బద్దలు కొట్టారని చెప్పుకొచ్చారు. సభలో జోగి ప్రసంగం సమయంలో సీఎం జగన్ వారించే ప్రయత్నం చేసారు. జోగి రమేష్ మాత్ర తన ప్రసంగాన్ని ఆపలేదు. సీఎం జగన్ ను ఎవరూ టచ్ చేయలేరని..ముందు తమను తాకాలని సవాలని చేసారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాల పై మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వకుండా దుష్టచతుష్ఠయం ఎన్నో ప్రయత్నాలు చేసిందన్నారు. అన్ని అవరోధాలను అధిగమిస్తూ పేదల ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. కేంద్ర మంత్రులను..అధికారులను కలిసి కోర్టుల్లో 16 కేసులు వేసారని వివరించారు. పెత్తందార్లపై పేదల యుద్దం మొదలైందన్నారు. అమరావతి ఇక అందరిదనీ..సామాజిక అమరావతి ఏర్పాటు అవుతుందని చెప్పుకొచ్చారు. 50 వేల మందికి ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేసారు.












Click it and Unblock the Notifications