వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కళ్యాణ్‌ పొలిటికల్ బ్రోకర్.. వికేంద్రీకరణ వద్దని ప్రకటన చెయ్యగలరా? మంత్రి కాకాణి గోవర్ధన్ సవాల్

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి మాట్లాడిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలు విచిత్రంగా ఉన్నాయని, పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ లాగా మారారని కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

పవన్ భారీ సొల్లు డైలాగుల వెనుక కారణమిదేగా.. వదిలిపెట్టని మంత్రి అంబటి రాంబాబు!!పవన్ భారీ సొల్లు డైలాగుల వెనుక కారణమిదేగా.. వదిలిపెట్టని మంత్రి అంబటి రాంబాబు!!

 పవన్ కళ్యాణ్ తో చేరాక పవన్ కళ్యాణ్ కు మతిమరుపు వచ్చింది

పవన్ కళ్యాణ్ తో చేరాక పవన్ కళ్యాణ్ కు మతిమరుపు వచ్చింది

చంద్రబాబుతో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ కు కూడా మతిమరుపు వ్యాధి వచ్చినట్లు ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును మరోమారు సీఎం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. విశాఖ రాజధాని వద్దని, రాష్ట్రంలో వికేంద్రీకరణ అవసరం లేదని, మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రకటన చేయగలరా అంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ ల పవన్ గా మారిపోయారని కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్


గతంలో జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ఆయనను విశాఖ ఎయిర్ పోర్ట్ లో నారా రాజ్యాంగం ప్రకారం రన్ వే పైన నిర్బంధించారని గుర్తు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి కానీ రాష్ట్రంలో వైసిపి హయాంలో అలాంటి ఇబ్బందులు ఏమీ లేవని, అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖలో స్వేచ్ఛగా తిరిగారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రజల బలం లేదని, ఆయన కుమారుడు లోకేష్ కు సత్తా లేదని పేర్కొని, అందుకే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పై ఎక్కువ ఆధారపడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.

 పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్

పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్


2014లో చంద్రబాబు తో పవన్ కలిసి, మళ్లీ ఎన్నికలలో విభేదించి, మళ్లీ ప్రస్తుతం బాబు కు మద్దతు ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. వ్యవసాయం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ కనీసం పది పంటలను గుర్తించలేరు అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు టిడిపి నేతలు వత్తాసు పలుకుతున్నారని, ఇద్దరి పొత్తుల రాజకీయాలు అందరికీ అర్థం అవుతున్నాయి అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ బ్రోకర్ లా విన్యాసాలు చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేశారు

జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు

జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు


పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో రెండు స్థానాల్లో పోటీ చేస్తే కనీసం ప్రజలు ఆయనను ఒక్కచోట కూడా గెలిపించలేదని చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ను విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు. సీఎం కావాలని పగటి కలలు కంటే సరిపోదు అని హుందాగా వ్యవహరించి మర్యాదను కాపాడుకోవాలని హితవు పలికారు. జగన్ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్ గల్లంతు అయింది అని పేర్కొన్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయ ఓనమాలు రాని పవన్ కళ్యాణ్ గాలికి కొట్టుకు పోతారన్నారు.

English summary
Minister Kakani Govardhan Reddy challenged that Can Pawan Kalyan announce that he does not want decentralization?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X