సినిమా టికెట్ల పెంపు పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
సినిమా టికెట్ల పెంపు పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు. టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఏపీ లో షూటింగ్ నిర్వహించే సినిమాలకు..సంబంధించి టికెట్ రేట్ల పెంపు..అదే విధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపు పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి ముందుగా హోం శాఖ నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం కానున్నారు. ఈ వరుస భేటీల తరువాత సినిమా టికెట్ల రేట్లు పెంపు పైన ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీలో సినిమా టికెట్ల పెంపు విధానం పైన త్వరలోనే నిర్ణయం ఉంటుందని మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. సినిమా అంశాల పైన ముందుగా సినిమాటోగ్రఫీ..హోమ్ శాఖ నేతృత్వంలో సమావేశం ఉంటుందని చెప్పారు. సినిమా టికెట్ రేట్లు పై ప్రధానంగా చర్చ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏపీ లో షూటింగ్ నిర్వహించే సినిమాలకు..సంబంధించి టికెట్ రేట్ల పెంపు..అదే విధంగా హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపు పై చర్చించి.. ప్రతిపాదనలు సిద్దం చేస్తామని వివరించారు. ఈ సమావేశం తర్వాత సినీ పరిశ్రమ ప్రముఖుల తో కీలక సమావేశం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి త్వరలో తేదీ ల ప్రకటన ఉంటుందని వెల్లడించారు.

కాగా, జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహణ కు ప్రభుత్వం సిద్దమైంది. టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహి స్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ లో ఈ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే విధంగా టూరిజం పై వర్క్ షాప్స్ ఉండనున్నాయి.
ఇక.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఏపీలో గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సులు.. ఒప్పందాల పైన చేసిన వ్యాఖ్యల పై మంత్రి దుర్గేశ్ స్పందించారు. కేసీఆర్ ఏదో విమర్శలు కోసం మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ అధికారం లో ఉన్నపుడు ఎం ఓ యూ లు గ్రౌండ్ అవ్వని పరిస్థితి వచ్చిందేమోనని వ్యాఖ్యానిం చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. కేసీఆర్ ఈ విషయం గుర్తు పెట్టు కోవాలని మంత్రి సూచించారు.












Click it and Unblock the Notifications