జనసేన కార్యకర్తలు జగన్ ను కోరుకుంటున్నారు - మంత్రి కారుమూరి..!!

మంత్రి కారుమూరి నాగేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేసారు.టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారని ఆరోపించారు. ఎవరు ఏం చెప్పినా విశాఖ వెళ్లటం ఖాయమని.. అక్కడ నుంచి పాలన ప్రారంభం అవుతుందని మంత్రి తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలతో పాటుగా టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా జగన్ పాలన కోరుకుంటున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. బాబు గతంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ తాను సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని శ్రీకాకుళం సభలో ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా విశాఖ నుంచి పాలన పైన మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వర రావు విశాఖ కేంద్రంగా సెప్టెంబర్ నుంచి పాలన ప్రారంభం కావటం ఖాయమన్నారు. దీనికి తగినట్లుగానే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తీరు పైన మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు తానే ఇంద్రుడు, చంద్రుడు అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి కాదని, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, పార్టీ, బ్యాంకు బ్యాలెన్స్ లాక్కుని అధికారంలోకి వచ్చారని విమర్శించారు.

karumuri-nageswar

చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయనందుకే ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. గతంలో బాబొస్తే జాబు వస్తుందని ప్రచారం చేసారని, కానీ..బాబు వచ్చినా జాబ్ రాలేదని ఎద్దేవా చేసారు. అదే విధంగానిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మోసం చేశారన్నారు. 600 వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు.

జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసారన్నారు. నాడు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసారని చెప్పారు. డీబిటీ ద్వారా నేరుగా వారి ఖాతాలోనే డబ్బు పడేలా చేస్తున్నారని చెప్పారు. కరోనా వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారని ప్రశంసించారు. చంద్రబాబు అక్రమాలు బయటకు వస్తున్నాయని..త్వరలోనే చంద్రబాబు జైలుకు వెళ్లటం ఖాయమని మంత్రి కారుమూరి వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+