అలా ఐతే కిరాణా కొట్టే పెట్టుకోండి: హీరో నాని కామెంట్లపై మంత్రి కొడాలి నాని కౌంటర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ రేట్ల వివాదం కొనసాగుతూనే ఉంది. సినిమా థియేటర్లపై దాడులు, నోటీసులు, సీజ్‌లు ఓవైపు కొనసాగుతుంటే.. మరోవైపు.. ఈ టికెట్ రేట్లతో థియేటర్లు నడపడం తమ వల్ల కాదంటూ కొందరు యజమానులు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ క్రమంలో సినీ తారలు, ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది.

కిరాణా కొట్టే పెట్టుకోండి..: నానికి కొడాలి నాని కౌంటర్
ఇటీవల టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యల రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా, మంత్రి కొడాలి నాని కూడా హీరో నాని వ్యాఖ్యలు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కిరాణా కొట్టుకు కలెక్షన్స్ ఎక్కువ వచ్చినపుడు సినిమా వాళ్లు తమ పెట్టుబడులు కిరాణా కొట్లో పెట్టుకోవచ్చు కదా? అంటూ సెటైర్లు వేశారు. 'సినిమా టికెట్ల రేట్లు ప్రభుత్వం ఎక్కడా తగ్గించలేదు. గతంలో కొన్ని సినిమాలకు రేట్లు పెంచాలని కోర్టు ద్వారా ఆర్డర్ తెచ్చుకునేవారు అని.. మా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఉండకూడదని జీవో ఇచ్చిందని.. కానీ, మేం రేట్లు ఎక్కడా తగ్గించలేదు' అని చెప్పారు మంత్రి కొడాలి నాని.

అది కొంతమంది గేమ్ అంటూ కొడాలి నాని
సినీ పరిశ్రమలోని కొందరు కోర్టు అనుమతితో అడ్డంగా దోచుకునే అవకాశం లేకుండా తమ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి కొడాలి నాని. సినిమా టికెట్ రేట్ తగ్గితే ఎగ్జిబిటర్లకు నష్టం అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎగ్జిబిటర్‌ను అడ్డం పెట్టుకుని సినిమా టికెట్ల విషయంలో కొంతమంది గేమ్ ఆడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొడాలి నాని. కాగా, సినిమా టికెట్లు తగ్గించడమంటే సినిమా చూసేవారిని అవమానించడమేనని హీరో నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంతేగాక, సినిమా థియేటర్ల కలెక్షన్ల కంటే పక్కన ఉండే కిరాణా కొట్ల కలెక్షన్లే ఎక్కువగా ఉంటున్నాయని వ్యాఖ్యానించారు.

సినిమా టికెట్ల వ్యవహారంపై ఏపీ సర్కారు ప్రత్యేక కమిటీ
కాగా, సినిమా టికెట్ల వ్యవహారంపై కమిటీని ఏర్పాటు చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఛైర్మన్‌గా 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా.. ఇందులో సినీ గోయెర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులకు చోటు కల్పించారు. చైర్మన్‌తో సహా ఏడుగురు అధికారులు కాగా, ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. సినిమా టికెట్ల వ్యవహారంలో ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూలంకషంగా ఈ కమిటీ చర్చించనుంది. టికెట్ల రేట్ల సమస్యకు ఈ కమిటీ ఏదైనా పరిష్కారం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాగా, సినీ నిర్మాత దిల్ రాజు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తామని, అన్ని విషయాలపై చర్చిస్తామని చెప్పారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications