పేర్ని నాని 'ఫిక్స్' - ఇక వదిలేది లేదు..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేతలు వరుస కేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. పలువురి పైన కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యుల పైన నమోదైన కేసులు.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నాని ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సమ యంలోనే మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పేర్ని నానికి వదిలేది లేదని చెప్పటం రాజకీయం గా ఉత్కంఠ పెంచుతోంది.

మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసారు. బందరులో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహరంలో పేర్ని నాని, పేర్ని కిట్టుపై పోలీసులు క్రిమినల్ కేసుల నమోదుకు సిద్దం అయ్యారు. దీంతో, అటు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి.. ఇటు రాజకీయంగానూ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నకిలీ పట్టాల పంపిణీలో తన ప్రమే యం గానీ, తన కొడుకు ప్రమేయం గానీ లేదని చెప్పుకొచ్చారు. మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యంగా పలు వ్యాఖ్యలు చేసారు. దీని పైన మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. పేర్ని నాని పాపం పండింది ఇక వదిలేది లేదని హెచ్చరించారు. గత 5 ఏళ్లు ప్రజల్ని పీక్కుతిని నేడు ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

minister-kollu-ravinda-warning-for-perni-nani-over-his-corruption-and-cases

2006లో బందరు పోర్టుని అమ్మేసేందుకు ప్రయత్నించిన నీచుడు పేర్ని నాని అని మంత్రి కొల్లు ధ్వజమెత్తారు. 2023లో బదిలీ అయిన తహశీల్దార్ 2024లో పట్టాలెలా ఇచ్చారని మంత్రి ప్రశ్నించారు. పేదలపై ప్రేముంటే 6400 టిడ్కో ఇళ్లు ఎందుకు పక్కన పెట్టారని నిలదీశారు. సీఆర్‌జెడ్ భూముల్లో పట్టాలివ్వడాన్ని కోర్టులే తప్పుబట్టాయని గుర్తు చేసారు. పేర్ని నాని సానుభూ తి రాజకీయాలకు కాలం చెల్లిందని..తప్పు చేసినోడిని చట్టం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. తప్పు చేసి బురద జల్లే ప్రయత్నం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు పేర్ని నానిని అవినీతి పరుడులా చూస్తున్నారని విమర్శించారు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. అయితే, ఈ ఇద్దరి మధ్య సాగుతున్న మాటల యుద్దం నడుమ.. పేర్ని నాని పైన ఎలాంటి చర్యలు ఉంటాయి.. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+