పల్టీలు కొట్టిన మంత్రి కారు: కొల్లు రవీంద్రకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రితోపాటు డ్రైవర్, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.
ప్రకాశం జిల్లా పర్యటన ముగించుకొని తన కారులో విజయవాడ వస్తుండగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దాటి ఖాజా టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ కారు బోల్తాపడింది.

వెంటనే వీరిని చికిత్స నిమిత్తం టోల్‌ప్లాజా వద్దనున్న హైవే అంబులెన్సు ద్వారా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి
తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం తమ్మయ్యపేట దగ్గర గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఇద్దరి శవాలను పోస్టుమార్టం కోసం తరలించారు.












Click it and Unblock the Notifications