పెన్షన్ల కోతపై ప్రభుత్వం కీలక ప్రకటన - వారివి రద్దు..!!
ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నిర్వహణ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల మొత్తాన్ని పెంచి ప్రతీ నెలా ఒకటో తేదీన ఇంటి వద్దే పంపిణీ చేస్తోంది. తాజాగా పెన్షన్ల అర్హుల జాబితాల పైన క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వం సమాచారం సేకరించింది. అందులో పలువురు అనర్హులు దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో.. ఈ అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల కోత.. కొనసాగింపు పైన స్పష్టత ఇచ్చింది.
ఏపీలో దివ్యాంగ పెన్షన్లు పెద్ద సంఖ్యలో తొలిగిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాయి. దీని పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు. గత కొన్ని రోజులు గా 4 లక్షల 50 వేలు పెన్షన్ తొలగించారని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పారు.
65 లక్షల పెన్షన్ ను ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తోందని వివరించారు. వృద్ధాప్యం లో ఉన్న భర్త చనిపోతే భార్యకు కూడా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. దివ్యాoగుల పెన్షన్ లో నకిలీ సెర్టిఫికెట్ తో గత ప్రభుత్వం లో నమోదు అయ్యాయని పేర్కొన్నారు. వీటి పైన తొమ్మది నెలలుగా పరిశీలన జరుగుతోందని చెప్పారు.

ఆరోగ్య కారణాలతో ఇస్తున్న ప్రతీ పెన్షన్ ను పరిశీలన చేసామని మంత్రి శ్రీనివాస్ వివరించారు. మొత్తంగా 7 లక్షల 95 వేల పెన్షన్ వెరిఫికేషన్ జరిగిందని చెప్పారు. 20 వేల మంది డిసేబుల్ లో అనర్హత ఉన్న వారిని వృద్ధాప్య పెన్షన్ లో కన్వర్ట్ చేస్తున్నామని వెల్లడించారు. దివ్యాంగ పెన్షన్లు తీసుకుంటున్న వారిలో 80 వేల మందికి నోటీసులు ఇచ్చామని చెప్పారు. వీరు తగిన ర్టిఫికెట్ ఇస్తే వారికి పెన్షన్ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేసారు. అనర్హులు ఉంటే పెన్షన్లు రావని మంత్రి తేల్చి చెప్పారు. అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశమని స్పష్టం చేసారు. దివ్యాoగుల పెన్షన్ లో నకిలీ సెర్టిఫికెట్ తో గత ప్రభుత్వం లో నమోదు అయ్యాయని వివరించారు. ఇప్పటికే పెన్షనర్ల అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని నిర్ణయించారు. అనర్హులు కోరితే.. తిరిగి పరిశీలన చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications