వివాహవ్యవస్థపై గౌరవం లేని పవన్ కళ్యాణ్ హిందూధర్మంపై మాట్లాడటమా? విరుచుకుపడ్డ మంత్రి

తాజాగా హిందూ ధర్మాన్ని ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నాయకుల అగౌరవపరిచే చూస్తూ ఊరుకోబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో హెచ్చరించారు. దేవాలయాలలో అర్చకులను వేలం వేయడాన్ని పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు. ఈ అంశంపై కోర్టులో సవాలు చేస్తానని ఆయన స్పష్టం చేశారు.దీంతో పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ హిందూధర్మం పై మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. అసలు హిందూ సంస్కృతి గురించి పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు. వివాహ వ్యవస్థ పై గౌరవం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లను పవన్ కళ్యాణ్ చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

pawankalyan1

అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని, దళారీ వ్యవస్థకు తావు లేకుండా తాము అన్ని చర్యలు చేపడుతున్నామని, భక్తులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. లక్షల ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్తోమత ఉన్నవారు కూడా భగవంతుని సన్నిధిలో వివాహాలు చేసుకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

అక్కడ జరిగే పెళ్లిళ్లకు ఆలయ నిర్వాహకులు బాధ్యులు కాదని పేర్కొన్న ఆయన, ఆలయంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించడం కోసం ప్రత్యేక అధికారిని నియమించామని తెలిపారు. దీంతో బ్రోకర్ల వ్యవస్థకు చెక్ పడిందని, దీంతో వారంతా పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.

kottusathyanarayana

అసలు రాష్ట్రంలో దేవాలయాలను కూల్చింది నీ దత్త తండ్రి చంద్రబాబే అని చంద్రబాబును టార్గెట్ చేసిన కొట్టు గతంలో దేవాలయాలు కూల్చి వేసినప్పుడు కళ్ళు మూసుకున్నావా.. అప్పుడు అడగలేదేం.. అప్పుడు కోర్టులో ఎందుకు కేసు వేయలేకపోయావు అంటూ పవన్ కళ్యాణ్ ను నిలదీశారు.

రోజురోజుకీ పవన్ కళ్యాణ్ దిగజారి పోతున్నాడని చంద్రబాబు లాంటి శనిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు అని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబును వదిలేస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే ప్రజలు మరోసారి నీకు బుద్ధి చెబుతారని కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+