జ‌గ‌నాసురుడి దుష్ట‌పాల‌న.. దసరానాడు ధ్వజమెత్తిన మంత్రి లోకేష్; సీఎం చంద్రబాబు ఏమన్నారంటే

దేశ వ్యాప్తంగా దసరా పండుగను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. దసరా పర్వదినం సందర్భంగా దేశ విదేశాలలోని తెలుగు వారికి రాజకీయ రంగ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. తాజాగా నేడు దసరా సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

దసరా శుభాకాంక్షలు చెప్పిన సీఎం చంద్రబాబు
ప్రజలంతా సుఖ శాంతులతో వర్థిల్లేలా చూడాలని ఆ కనకదుర్గమ్మ తల్లిని వేడుకుంటున్నానని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే దసరా పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. దుష్ట సంహారం తర్వాత శాంతి, సౌభ్రాతృత్వంతో అందరూ కలిసిమెలిసి జీవించాలన్నదే దసరా పండుగ సందేశం అన్నారు. ఇదే స్ఫూర్తితో శాంతియుత, అభివృద్ధికారక సమాజం కోసం కృషి చేద్దాం అన్నారు.

Minister Lokesh harsh comments over Jagan on vijayadashami CM Chandrababu wishes

సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దాం అన్న సీఎం
శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ పండుగ దినాల్లో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం అని పేర్కొన్న సీఎం చంద్రబాబు మరో వైపు ఆ దేవదేవుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుకున్నాం అని వెల్లడించారు. ఇదే ఒరవడితో సర్వజన సంక్షేమాన్ని కొనసాగిద్దాం అంటూ పేర్కొన్నారు. మరొక్క మారు అందరికి మనస్ఫూర్తిగా దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

దసరా నాడు జగన్ ను టార్గెట్ చేసిన లోకేష్
ఇదిలా ఉంటే తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ ద‌స‌రా, విజ‌య‌ద‌శ‌మి శుభాకాంక్ష‌లు అని పేర్కొన్నారు నారా లోకేష్. ఈ సందర్భంగా జగన్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేసి, ప్ర‌జ‌ల్ని హింసించిన జ‌గ‌నాసురుడి దుష్ట‌పాల‌నను జ‌నమే అంత‌మొందించారు అని పేర్కొన్నారు. వైసీపీ చెడుపై కూట‌మి మంచి విజ‌యం సాధించింది. వ‌ర‌ద రూపంలో వ‌చ్చిన విప‌త్తుపై విజ‌యం సాధించాం అన్నారు.

శుభవార్తలు చెప్పిన లోకేష్
వేలాది ఉద్యోగాలు ఇచ్చే లులూ, ఫాక్స్ కాన్‌, హెచ్సీఎల్ విస్త‌ర‌ణ‌, టీసీఎస్ తెచ్చుకున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. పోల‌వ‌రం సాకారం కానుందని మంత్రి లోకేష్ వెల్లడించారు. రైల్వేజోన్ శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు కేంద్రం చేయూత‌నందిస్తోంది అని శుభవార్తలు చెప్పారు.

మంచి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు
ఇన్ని మంచి విజ‌యాలు అందించిన ఈ విజ‌య‌ద‌శ‌మిని సంతోషంగా జ‌రుపుకుందాం అని పేర్కొన్నారు లోకేష్ . ప్ర‌జా సంక్షేమం- రాష్ట్ర‌ ప్ర‌గతే ధ్యేయంగా శ్ర‌మిస్తున్న మంచి ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు, దుర్గ‌మ్మ ఆశీస్సులు ల‌భించాల‌ని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+