తల్లికి వందనం డబ్బులు జమ, అందని వారు ఇలా- లోకేష్ ప్రకటన..!!
మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేసారు. తల్లికి వందనం నిధులు జమ ప్రారంభించామని.. అందరి లబ్ది దారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. అర్హత ఉన్నవారు ఎంతమంది ఉన్నా నగదు జమ చేస్తామని చెప్పారు. అర్హత ఉండీ.. నగదు జమ కాని వారు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేస్తే.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ అమ్మ ఒడి నిబంధ నలనే తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. తన పైన వైసీపీ నేతలు ఈ పథకం పై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేసారు.
తల్లికి వందనం పథకం నిధుల జమ పైన మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ నగదు జమ చేస్తామని వెల్లడించారు. తల్లికి వందనం ద్వారా 67,27,624 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్ల లో జమ చేస్తున్నామని వివరించారు. అర్హులు ఎంత మంది ఉన్నా నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సాంకేతిక సమస్యలతో నిధులు జమ కాకపోతే వాట్సాప్ కంప్లెయింట్ ఇస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి ద్వారా 42లక్షల మంది పిల్లలకు మాత్రమే నిధులు ఇచ్చారని గుర్తు చేసారు. 2శాతం మంది తల్లుల అకౌంట్ ఇనాక్టివ్ ఉన్నట్లు గుర్తించామని.. వారికి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేశామని చెప్పారు. డాక్టర్ సర్వే పల్లె రాధాకృష్ణ విద్యా మిత్ర ద్వారా పిల్లలకు స్కూల్ కిట్ అందచేస్తున్నట్లు వివరించారు.

రాష్ట్రంలో విద్యార్ధులకు మధ్యాహ్నం భోజనం లో సన్నబియ్యం అమలు చేస్తున్నామని లోకేష్ పేర్కొన్నారు. వన్ క్లాస్ కాన్ టీచర్ అనే నినాదం తో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల లకు ఉచితంగా కరెంట్ సరఫరా ఇస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు సోమ వారం కల్లా పూర్తి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. అందరి ఆమోదం తో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చామని వివరించారు. ఆంధ్రా మెడల్ ఎడ్యుకేషన్ దేశం లో అన్ని రాష్ట్రాలకు అందరికీ ఆదర్శం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ పిల్లలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేసిన లోకేష్.. ఎవరైనా ప్రయివేటు పాఠశాలలు ప్రారంభించ వచ్చని.. వారితో ప్రభుత్వ పాఠశాల లు పోటీ పడతాయని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పథంలో తన పైన వైసీపీ పెట్టిన పోస్టింగ్ 24 గంటల్లో తెలిగించాలని లోకేష్ డిమాండ్ చేసారు. లేకుంటే న్యాయ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్య ప్రమాణాలను తిరిగి నెలకొప్పుతున్నామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications