మా వల్ల తప్పు జరిగింది.. క్షమించండి - మంత్రి నారా లోకేష్
తన ద్వారా జరిగిన ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి క్షమాపణలు సైతం ఆయన కోరారు. నారా లోకేష్ ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీ కొనడంతో కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి కారు డ్యామేజ్ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్వయంగా బాధితుడు కళ్యాణ్ భరద్వాజ్ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టును నారా లోకేష్‌కు ట్యాగ్ చేశారు.
''నారా లోకేష్ గారు..నేను మీ పరిపాలనను మరియు టీడీపీని చాలా ప్రేమిస్తున్నాను మరియు మిమ్మల్ని తిరిగి ఆదేశానికి తెచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ. ఈరోజు విశాఖపట్నం హైవే వద్ద తాటిచట్లపాలెం దగ్గర మేము మీ కాన్వాయ్ వెళ్లేందుకు స్టాటిక్ మోడ్‌లో రోడ్డు పక్కన ఉండగా మీ కాన్వాయ్ నన్ను ఢీకొట్టింది, మీ కారు ఒకటి మమ్మల్ని ఢీకొట్టి వెళ్లిపోయింది'' అని బాధితుడు కళ్యాణ్ భరద్వాజ్ తన పోస్ట్‌లో తెలిపారు.అంతేకాకుండా కారు డ్యామేజీ అయిన ఫొటోలను సైతం తన పోస్టుకు జత చేశారు.

కళ్యాణ్ భరద్వాజ్ చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. ''దయచేసి నా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండి @wazzpogaru.నేను నా భద్రతా బృందానికి తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశిస్తాను. నా బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది మరియు డెంట్‌ను సరిచేయడానికి అయ్యే ఖర్చులను భరిస్తుంది'' అంటూ మంత్రి రిప్లై ఇచ్చారు.లోకేష్ పోస్టుకు కళ్యాణ్ భరద్వాజ్ తిరిగి రిప్లై ఇచ్చారు.
Please accept my sincere apologies @wazzpogaru. I will instruct my security team to take extreme care and ensure such incidents won't happen again. My team will get in touch with you and cover the expenses incurred to correct the dent. https://t.co/b83oHKyQu3
— Lokesh Nara (@naralokesh) September 25, 2024
తన కాంటాక్ట్ నంబర్ అంటూ ఒక ఫోన్ నంబర్ ను పేర్కొన్నారు. అలాగే లోకేష్ స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు లోకేష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకత్వ లక్షణాలను చూపించారంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.నాయకుడి లక్షణం అంటే ఇలాగే ఉండాలని.. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోవడమే కాకుండా క్షమాపణ కూడా చెప్పడం గ్రేట్ అంటూ టీడీపీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications