టీడీపీ లీడర్స్ కు నారా లోకేష్ పిలుపు, పిఠాపురం నుంచి టన్ను టన్నులు వచ్చేశాయి
ఆంధ్రప్రదేశ్ లో వరద బాధితుల కోసం సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరు స్వచ్చందంగా ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ టీడీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలకు మంగళవారం సాయంత్రం మనవి చేశారు. మంత్రి లోకేష్ పిలుపుతో మంగళవారం కృష్ణాజిల్లాలు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలోని టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడకు చేరుకుని వరద బాధిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడానికి పని చేస్తున్నారు.
టీడీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సహాయక చర్య పాల్గొంటున్నారు. ప్రకాశం బ్యారేజీ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ధైర్యంగా ఉండాలని, వరద బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకుంటుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కృష్ణమ్మకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 8 వేల క్యూసెక్కుల నీరు తగ్గి 11. 25 లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరుతుంది.

ఇప్పటికే 42 పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఆశ్రయం కల్పించారు. వరద బాధిత కేంద్రాలలో ఉన్న ప్రజలకి ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. కృష్ణా నదిలో చిక్కుకున్న 21 మందిని హెలికాప్టర్ ద్వారా ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది కాపాడారు, నదిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంగళవారం రాత్రికి ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు విజయవాడకు చేరుకుంటారని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలోని టీడీపీ నాయకులు వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజక వర్గం టీడీపీ ఇన్ చార్జ్ వర్మ వరద బాధితులను ఆదుకోవడం కోసం తన వంతు సహకారంగా 5 టన్నుల కూరగాయలను విజయవాడలోని వరద బాధితులకు పంపించారు. పిఠాపురం టీడీపీ ఇన్ చార్జ్ వర్మ తీసుకున్న చొరవపై టీడీపీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు ఆయన్ను అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులను ఆదుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆ పార్టీ కార్యకర్తలకు మనవి చేశారు.












Click it and Unblock the Notifications