సాక్షి దిన పత్రికపై పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్
టీడీపీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అప్పుడప్పుడు సాక్షి దినపత్రిక ప్రతినిధులకు ఝలక్ ఇస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ సాక్షి దినపత్రికలో అనేక కథనాలు పబ్లిష్ అయ్యాయి. ఆసమయంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నారా లోకేష్, టీడీపీ నాయకులు చూసి చూడనట్లు కొంత కాలం సైలెంట్ గా ఉండిపోయారు.
అయితే సాక్షి దినపత్రికలో కొంతకాలం క్రితం చినబాబు చిరుతిండి 25 లక్షలు అండి అనే టైటిల్ తో ఓ కథనం ప్రచురితమైంది. ఆ సందర్భంలో తనపై అసత్య కథనాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ నారా లోకేష్ సాక్షి దినపత్రిక పై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. విశాఖపట్నం కోర్టులో వివిధ కారణాలతో చాలా రోజులుగా నారా లోకేష్ వేసిన పరువు నష్టం కేసు విచారణ వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది. సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నాయకుడు నారా లోకేష్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. విశాఖపట్నం 12వ జిల్లా కోర్టు ముందు నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వెంట టీడీపీ నాయకులు కొందరు ఉన్నారు. ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ లు పెట్టిన నారా లోకేష్ సాక్షి విలేకరి ఇక్కడికి వచ్చారా అంటూ చాలా సందర్భాల్లో మీడియా మిత్రులను అడిగిన విషయం తెలిసిందే.
సాక్షి దినపత్రిక తో పాటు సాక్షి టీవీ, మరొకొన్ని ప్రైవేట్ టీవీ చానల్స్ పై మంత్రి నారా లోకేష్ అప్పుడప్పుడు సెటైర్లు కూడా వేస్తుంటారు. మీ తప్పు ఏముంది లేండి, మీ యాజమాన్యం ఎలా చెబితే మీరు అలా వినాలి కాదా అంటూ ఇటీవల సాక్షి దినపత్రిక విలేకరికి మంత్రి నారా లోకేష్ చిన్న ఝలక్ ఇచ్చారు. తనమీద కావాలనే కక్ష కట్టిన సాక్షి టీవీ, సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని, తన గురించి తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి నారా లోకేష్ చాలా సందర్భాల్లో మండిపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో సాక్షి దినపత్రికపై వేసిన పరువు నష్టం దావా కేసు విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని మంత్రి నారా లోకేష్ నిర్ణయించుకున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications