రూ.5 లక్షల చెక్ అందించిన నారా లోకేష్: వాటికి శాశ్వత పరిష్కారానికి హామీ

Heavy rains in AP: ఏపీని వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12: 30 నుంచి 2:30 గంటల మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకింది. అనంతరం బలహీనపడింది. అయినప్పటికీ- వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి- కృష్ణా, గుంటూరులను ముంచెత్తాయి. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునకేసింది. చెరువును తలపిస్తోంది. విజయవాడలో వరద.. విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

Minister Nara Lokesh handover a Check Rs 5 lakh to the victim s family in Mangalagiri

భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారా లోకేష్. బాధితులను కలిశారు. వారితో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు.

ఒకవంక తేలికపాటి జల్లులు పడుతున్నప్పటికీ బాధితులను పరామర్శించడంలో నారా లోకేష్ వెనుకంజ వేయలేదు. స్థానిక నాయకులతో కలిసి ముంపు గ్రామాలను సందర్శించారు. జలమయమైన వీధుల్లో కలియతిరిగారు. మంగళగిరి రత్నాలచెరువు ముంపునకు గురైన ప్రాంతానికి వెళ్లారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

అనంతరం కొత్తపేటకు వెళ్లారు. శనివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందిన నాగరత్నమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాగరత్నమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అయిదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం మంగళగిరిలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చేపట్టామని, ఇందులో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో దాదాపుగా 450 మురుగునీటి పారుదల కాలువలను శుభ్రం చేశామని వివరించారు.

వరద ముంపు బాధితుల కోసం ప్రత్యేకంగా సహాయ, పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశామని నారా లోకేష్ వివరించారు. తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంగళగిరి నియోజకవర్గంలో మొత్తం ఓపెన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నెట్‌వర్క్‌ను మెరుగ్గా తీర్చిదిద్దుతామని అన్నారు.

ఓపెన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నెట్‌వర్క్‌ మ్యాపింగ్ చేశామని, వర్షపు, వరదనీరు సాఫీగా ప్రవహించేలా వాటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్ల మీద నిల్వఉండకుండా వరదనీరు ఫ్లడ్ కెనాల్ప్‌లో ప్రవహించడానికి శఆశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+