తునిలో మైనర్‌పై అత్యాచారయత్నం.. నారా లోకేష్ షాకింగ్ రియాక్షన్ !
కాకినాడ జిల్లా తుని పట్టణంలో చోటు చేసుకున్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. హంసవరం ప్రాంతానికి చెందిన నారాయణరావు అనే వృద్ధుడు.. స్థానిక గురుకుల పాఠశాలలో చదువుతున్న 8వ తరగతి మైనర్ బాలికను హాస్టల్ నుంచి "ఇంటికి తీసుకెళ్తాను" అని చెప్పి.. అసభ్యకరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించినట్లు సమాచారం. సమీపంలోని సపోటా తోటల్లో బాలికతో ఉన్న వృద్ధుడిని పట్టుకోగా తాను టీడీపీకి చెందిన వాడినని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన తీవ్ర కలకలం రేపిన తరుణంలో సదరు నిందితుడికి దేహశుద్ది చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో (POCSO) కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ విషయంపై బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా పాఠశాల నుంచి బాలికను ఎలా పంపించారు? అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాల, స్థానిక అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు.

మంత్రి నారా లోకేష్ రియాక్షన్..
ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై అత్యాచారయత్నం ఘటన షాక్‌కు గురిచేసింది. ఇలాంటి కేసులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తాము" అని మంత్రి హామీ ఇచ్చారు. బాధితురాలు ధైర్యంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చి, అన్నివిధాలా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుకునే విద్యార్థినులకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిందిగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చినట్టు రాసుకొచ్చారు.
తుని రూరల్ గురుకుల పాఠశాల విద్యార్థినిపై తాటిక నారాయణరావు అనే కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలుసుకొని షాక్ కు గురయ్యాను. సంఘటన వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు అతడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వాడెవరైనా ఉక్కుపాదంతో…
— Lokesh Nara (@naralokesh) October 22, 2025
టీడీపీ క్లారిటీ..
సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిదని టీడీపీ స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలను ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని.. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుందన్నారు. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదని.. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే శిక్షలు ఉంటాయన్నారు. ఇప్పటికే నిందితుడిపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండుకు పంపుతున్నారు. కఠినమైన శిక్షలు పడేలా పోలీసుల చర్యలు తీసుకుంటున్నారు.
సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన క్షమించరానిది. ఇటువంటి చర్యలను ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎంతటి వారినైనా, ఏ పార్టీకి చెందిన వారినైనా కఠినంగా శిక్షిస్తుంది. టీడీపీకి సంబంధించిన ఏ విభాగంలో కూడా ప్రస్తుతం నిందితుడికి ఏ పదవీ లేదు. తప్పు చేస్తే నాయకులకైనా, సామన్యులకైనా ఒకే… pic.twitter.com/FxNTLHOttB
— Telugu Desam Party (@JaiTDP) October 22, 2025
హోంమంత్రి ఆదేశాలు..
అలానే హోంమంత్రి అనిత సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించి నారాయణరావును వెంటనే అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అలాగే గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రతను కల్పించాలని హోంమంత్రి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications