2 లక్షల ఉద్యోగాలు, అన్ని జిల్లాల్లో పరిశ్రమలు, మంత్రి నారా లోకేష్
పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సీఐఐ ఇన్ఫ్రా స్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని, విశాఖ రీజియన్ లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు.
గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో నూతన విధానం అందుబాటులోకి తెచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ హబ్ గా విశాఖపట్నం రూపుదిద్దుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఎయిర్ పోర్టు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం అయ్యాక విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తాయని, విశాఖపట్నం ట్రిలియన్ డాలర్ ఎకానమీగా చేయడం మా లక్ష్యమని మంత్రి నారా లోకేష్ వివరించారు.

కర్నూలు జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధిపై దృష్టి సారిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నం తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ మనవి చేశారు. చంద్రబాబు నాయకత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి నారా లోకేష్ వివరించారు.
2047 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు. చిత్తూరు, కడప జిల్లాలలో ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రీస్, అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, కృష్ణ, గుంటూరు జిల్లాలలో క్యాపిటల్ రీజియన్, ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్, గోదావరి జిల్లాలలో ఆక్వా ఉత్పత్తుల పరిశ్రమల అభివృద్ధి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వస్తామని, విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి నారా లోకేష్ వివరించారు.












Click it and Unblock the Notifications