జగన్ గుర్తు పెట్టుకో, తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే అడ్రస్ గల్లంతు, నారా లోకేష్ వార్నింగ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డా.రు. లేనివి ఉన్నట్లు క్రియేట్ చేసి వాటిని ప్రజల వద్దకు తీసుకువెళ్ళి తప్పుడు ప్రచారం చేసే వైఎస్ జగన్ మరోసారి మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ నువ్వు ఎవరితోనైనా పెట్టుకో తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే నీకే మంచిది కాదని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ను హెచ్చరించారు.

విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్లు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చెప్పి దాన్ని నిజం చేయాలనే భ్రమతో మాజీ సీఎం జగన్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెక్స్ లో పోస్ట్ చేశారు.

Minister Nara Lokesh warned Jagan not to do politics in the name of Tirumala Srivari

ఫేక్ జగన్ నువ్వు మారవు, నీ ఫేక్ మూకలు కూడా మారవు, ఫేక్ చేసి చేసి 151 సీట్లు ఇప్పుడు 11 సీట్లకు వచ్చాయని, నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఒక్క సీటు కూడా రాదని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం జగన్ ను ఉద్దేశించి ఎక్స్ లో వ్యంగంగా పోస్టు చేశారు. విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలను తిరుమలలో పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు.

తిరుమల ఏడుకొండలపై నీ విష రాజకీయాలు మానుకోవాలని మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు హితువు పలికారు. రెండు రోజుల క్రితమే మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం జగన్ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖను సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి బ్రష్టుపట్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. జగన్ ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ కూడా ఆయన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. విజయవాడ వరదల విషయంలో కూడా జగన్ చేసిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల విషయంలో మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+