నారాయణ... నిజంగా కార్యదక్షుడే!: సీఎం సమక్షంలో సచివాలయ పనుల వద్దే కేక్ కట్ చేశాడు
అమరావతి: పొంగూరు నారాయణ... రాష్ట్ర విభజనకు ముందు వరకు నారాయణ విద్యాసంస్ధల ఛైర్మన్‌గా అందరికీ సుపరిచితం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు... నారాయణకు మున్సిపల్ శాఖను అప్పగించారు.
దీంతో పాటు నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి సంబంధించిన కీలక విభాగం సీఆర్డీఏ పగ్గాలను కూడా ఆయనకే అప్పగించారు. నవ్యాంధ్ర రాజధానిలో నూతనంగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల్లో అన్నీతానై వ్వవహారిస్తున్నారు. అంతేకాదు రాజధాని ప్రాంతంలో ఉంటూ పనులన్నింటినీ దగ్గరుండి చూసుకుంటున్నారు.
బుధవారం మంత్రి నారాయణ తన జన్మదిన వేడుకలను సైతం పక్కనబెట్టేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలగపూడికి వస్తున్న తరుణంలో ఆయన వెంట వెళ్లారు. తాత్కాలిక సచివాలయం వద్ద జరుగుతున్న పనులను స్వయంగా చంద్రబాబుకు వివరించారు.

ఇదే సమయంలో నారాయణ జన్మదినం విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు... ఓ కేక్‌ను అక్కడికే తెప్పించారు. నిర్మాణ పనుల వద్దే నారాయణతో చంద్రబాబు కేక్ కట్ చేయించి ఆయన నోటిని తీపి చేశారు. నిర్మాణ పనుల పరిశీలన క్రమంలో తలపై పెట్టుకున్న హార్డ్ హ్యాట్ (ఇంజినీర్లు వినియోగించే హెల్మెట్)ను తలపై ఉంచుకునే నారాయణ కేక్ కట్ చేయడం విశేషం.
అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తాత్కాలిక సచివాలయానికి అవసరమైన మంచినీటి కోసం 14 కిలోమీటర్ల మేర పైపులైను నిర్మిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇప్పటికే ఏడు కిలోమీటర్లు మేర పైపులైన్లు వేశామని, ఇంకా ఏడు కిలోమీటర్లు వేయాల్సి ఉందన్నారు.
సచివాలయానికి వచ్చే అప్రోచ్ రోడ్లు నిర్మిస్తూనే.. మెయిన్ రోడ్డుకు కనెక్టివిటీ ఇస్తూ దానిని కూడా విస్తరిస్తామన్నారు. ఈనెల 20న మెయిన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర విభజన చేశామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొనడంపై సీఎం స్పందించారు.
రాష్ట్రాన్ని ఎంత దౌర్భాగ్యంగా విభజన చేశారో కాంగ్రెస్ నేతలే నిసిగ్గుగా చెప్పుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు వెలగపూడిలో వాతావరణం చాలా బాగుందని చంద్రబాబు కితాబిచ్చారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గాలి వీస్తుండటంతో 'ఇక్కడ కూర్చుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నుంచే పాలన చేసినట్టు ఉంది. ఇలాంటి వాతావరణంలో పనిచేస్తే ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి. పనులు బాగా జరుగుతాయి' అన్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications