టైం స్టార్ట్ నౌ! 3 నిమిషాల్లో ప్రభుత్వాన్ని పడగొట్టు: ముద్రగడకు నారాయణ

విజయవాడ: తాను తలచుకుంటే కేవలం మూడు నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూలదోస్తానని కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పి నారాయణ తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని పడగొడతాననడం సరికాదన్నారు.

ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. టైం స్టార్ట్... నీకు మూడు నిమిషాల సమయం ఇస్తున్నానని, ప్రభుత్వాన్ని పడగొట్టు చూద్దామని సవాల్ చేశారు. ఆయన వ్యాఖ్యలు కాపు జాతి మొత్తం తలదించుకునేలా ఉన్నాయన్నారు.

ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు వైసిపి అధినేత నేత జగన్ చేతిలో ముద్రగడ కీలుబొమ్మలా మారారన్నారు. జగన్, ముద్రగడ ఒకేలా మాట్లాడుతున్నారని, కాపు రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, ఈ తరహా విమర్శలు సరికావన్నారు.

Minister Narayana challenges Mudragada Padmanabham

కాపులకు మంత్రి పదవులను ఇచ్చారని, రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించారని, ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఇచ్చారని గుర్తు చేశారు. కేవలం పచ్చ చొక్కాలు ధరించిన వారికే కాపు రుణాలు ఇస్తున్నారనడం సరికాదన్నారు.

ముద్రగడ చేసిన ఆరోపణలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. రాజధాని కోసం బెదిరించి భూములు లాక్కున్నామన్నది అవాస్తవమని చెప్పారు. కాపు జాతి తలదించుకునే వ్యాఖ్యలు ముద్రగడ చేయడం విడ్డూరమన్నారు. ఒకరు స్క్రిప్ట్ రాసిస్తే ముద్రగడ మాట్లాడుతున్నారన్నారు. 11 నుంచి ఆయన చేయనున్న దీక్షను తాము పట్టించుకోమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+