మంత్రి నారాయణ షాకింగ్ నిర్ణయం: నిషిత్ 'బెంజ్'ను ఇంటికి తీసుకురావాలని!

Subscribe to Oneindia Telugu

నెల్లూరు: ఎదిగొచ్చిన కొడుకును పోగొట్టుకుని.. ఏపీ మంత్రి నారాయణ తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. నిషిత్ నారాయణ దుర్మరణం తర్వాత కుటుంబ సభ్యుల్లో విషాదం అలుముకుంది. ఇప్పుడిప్పుడే ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. నిషిత్ నారాయణ ప్రమాదానికి గురైన కారుకు మరమ్మత్తులు చేపించి.. ఇంటి వద్దే పెట్టుకోవాలని మంత్రి నారాయణ భావిస్తున్నారట. కుమారుడి చివరి జ్ఞాపకంగా దాన్నిపదిల పరుచుకోవాలనుకుంటున్నారట. అయితే ఆయన నిర్ణయానికి పలువురు అభ్యంతరం తెలుపుతున్నట్లు సమాచారం.

అరటిచెట్టుతో 'నిషిత్'కు వివాహం, బోరుమన్న కుటుంబం.. పెన్నా ఒడ్డునే ఎందుకంటే?

minister narayana decided to repair nishit benz car

కుమారుడి ప్రాణాలు పోగొట్టుకున్న కారును ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడం అరిష్టం అని బంధువులు, సన్నిహితులు వారిస్తున్నారట. అయితే నారాయణ మాత్రం ఆ కారుకు మరమ్మత్తులు చేయించి, ఇంటికి తెచ్చేందుకే మొగ్గు చూపుతున్నారట. ఈ వార్తలో నిజానిజాలెంతో తెలియదు గానీ, ఇప్పుడిదే వార్త అటు జనంలోను, ఇటు మీడియాలోను చర్చనీయాంశంగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its an interesting rumour regarding Nishit Naryana's accident. Minister Narayna was decided to repair that benz car
Please Wait while comments are loading...