అమరావతి ల్యాండ్ పూలింగ్‌పై కీలక ప్రకటన..!!

అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమరావతిలో నిర్మాణాలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో రెండో విడత భూ సమీకరణ పైన ప్రభుత్వం తాజా గా కసరత్తు చేసింది. అయితే, గ్రామాల్లో సభలు నిర్వహించిన సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలోనూ ఈ అంశం పై చర్చ జరిగింది. రెండో విడత సమీకరణ పైన తర్జన భర్జన కొనసాగుతున్న వేళ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వ ఆలోచన పైన స్ఫష్టత ఇచ్చారు.

రాజధాని లో మంత్రి నారాయణ పర్యటించారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై ఎవరూ అభ్యంత రం చెప్పలేదనివెల్లడించారు. ల్యాండ్ పూలింగ్‌పై వచ్చే కేబినెట్‌‌లో చర్చిస్తామని ప్రకటించారు. సబ్ కమిటీ‌లో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్‌పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నీకల్ సమస్యలు అన్ని పరిష్కరించామని తెలిపారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని చెప్పారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించా మని, మొత్తం 288 అపార్టుమెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.75 కంపెనీ లకు భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులని పూర్తి చేసి ప్రారంభిస్తామ ని చెప్పారు.

minister-narayana-made-key-statement-on-amaravati-second-phase-land-pooling

ఆలిండియా సర్వీస్ అధికారులకు ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీ‌నెస్ట్‌లో ఆరు టవర్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చ్ 31వ తేదీ లోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులని ఆదేశించారు. ఆలిండియా సర్వీసు అధికారుల టవర్లు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్ డిజైన్‌లు కూడా దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వస్తారని.. వారితో ఐకానిక్ టవర్ డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+