వైసీపీకి తగినబుద్ది చెబుతాం, ప్రపంచ బ్యాంకుకే తప్పుడు సమాచారం, మంత్రి నారాయణ
భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. వరదల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయవాడ ప్రజలు సాధారణ పరిస్థితి రావడానికి సుమారు పది రోజులకు పైగా సమయం పట్టింది. భవిష్యత్తులో విజయవాడ ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా తగిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు.
ఐఐటి మద్రాసు, హైదరాబాద్ కు చెందిన నిపుణులు ఇటీవల విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించి భవనాలు, పునాదుల పటిష్టతపై అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారని మంత్రి నారాయణ అన్నారు. అన్ని నిర్మాణాల సామర్థ్యం బాగుందని, పనులు కొనసాగించమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారని మంత్రి నారాయణ వివరించారు. కరకట్ట రోడ్లు నాలుగు వరుసలుగా నిర్మిస్తామని, భవిష్యత్తులో విజయవాడకు వరదనీరు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వివరించారు.

భవిష్యత్తులో వరదల కారణంగా ఎలాంటి ముప్పు తలెత్తకుండా రాజధాని నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కాలువలను డిజైన్ చేశామని, వీటిని బాగా లోతుగా వెడల్పు చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుడమేరు వరదకు విజయవాడలోని చాలా ప్రాంతాలు మునిగి పోయాయని, ప్రజలు చాలా రోజులు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ విచారం వ్యక్తం చేశారు.

కృష్ణా నదిలో ఎన్నడూ లేనంతగా 11. 43 క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా అమరావతిలోని ఏ ప్రాంతం మునగలేదని మంత్రి నారాయణ గుర్తు చేశారు. అయితే అమరావతి ముంపు ప్రాంతమని, రాజధాని నిర్మించ కూడదని, రుణాలు మంజూరు చేయకూడదని గతంలో వైసీపీ నాయకులు ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాశారని మంత్రి నారాయణ ఆరోపించారు. అమరావతి ముంపు ప్రాంతమని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారని మంత్రి నారాయణ మండిపడ్డారు.

వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారం అంతా అబద్ధమని ఇప్పుడు తేలిపోయిందని మంత్రి నారాయణ అన్నారు. వైసీపీ నాయకులు చేసిన తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొడుతూ రాజధాని అమరావతిని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి ముంపు ప్రాంతం కాదని నిరూపించి వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతామని మంత్రి నారాయణ అన్నారు. విజయవాడ వరద బాధితుల్ని అన్ని రకాలుగా ఆదుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారాయణ చెప్పారు.












Click it and Unblock the Notifications