మంత్రి నారాయణ తనయుడు 2 ని.ల్లో ఇంటికి చేరుకుంటాడనగా...!

ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, స్నేహితుడు రాజా రవివర్మ మృతి అందరినీ కలచివేస్తోంది. నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననేలోగా ప్రమాదం

హైదరాబాద్/అమరావతి: ఏపీ మంత్రి నారాయణ తనయుడు నిషిత్ నారాయణ, స్నేహితుడు రాజా రవివర్మ మృతి అందరినీ కలచివేస్తోంది. నిషిత్ నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. మరో రెండు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాననేలోగా ప్రమాదం జరిగింది.

దాదాపు రాత్రి పదకొండు గంటల వరకూ హైదరాబాద్ నారాయణ మెయిన్ బ్రాంచ్‌లో సిబ్బందితో సమావేశమై విద్యార్థుల అడ్మిషన్స్ తదితర విషయాల గురించి నిషిత్ చర్చించాడని తెలుస్తోంది.

స్నేహితుల నుంచి ఫోన్ వస్తే..

స్నేహితుల నుంచి ఫోన్ వస్తే..

అనంతరం నిశిత్ ఇంటికి బయలు దేరే ముందు స్నేహితుల నుంచి ఫోన్ వచ్చిందని, వారి కోరిక మేరకు స్నేహితులను కలిసి వారితో డిన్నర్ చేసి ఇంటికి బయలు దేరారని తెలుస్తోంది.

2 నిమిషాల్లో ఇంటికి చేరేవాడే..

2 నిమిషాల్లో ఇంటికి చేరేవాడే..

మరో రెండు నిమిషాలైతే ఇంటికి చేరి ఉండేవారేనని, కానీ అంతలోనే మృత్యువు తొమ్మిదో నెంబర్ పిల్లర్ రూపంలో బలి తీసుకుంది. అసలు రోడ్ నంబర్ 36 చాలా ప్రమాదకరమైన మూల మలుపు అని, అందులోనూ పిల్లర్ నెంబర్ తొమ్మిది అత్యంత ప్రమాదకరమైనదని స్థానికులు అంటున్నారు.

ప్రత్యక్ష సాక్షి..

ప్రత్యక్ష సాక్షి..

కాగా, ప్రమాదం అతి వేగం వల్లే జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి కొన్ని వివరాలను వెల్లడించాడు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పని చేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

భారీ శబ్దం... భయపడి నిద్రలేచిన గార్డ్

భారీ శబ్దం... భయపడి నిద్రలేచిన గార్డ్

ప్రమాదం జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో తాను నిద్రపోతున్నానని, పిల్లర్‌ను కారు ఢీకొట్టడంతో పెద్ద శబ్దం వచ్చిందని చెప్పాడు. ఆ శబ్దానికి తాను భయపడి లేచానని తెలిపాడు. అర్ధరాత్రి దాటాక ఇది జరిగిందన్నాడు.

కారు వేగానికి పిల్లర్ విరిగింది..

కారు వేగానికి పిల్లర్ విరిగింది..

ఆ తర్వాత ఏమైందోనని వెళ్లి చూశానని, కారు ఢీకొట్టిన వేగానికి పిల్లర్ విరిగి కాంక్రీట్ బయటికొచ్చిందని సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. ఆ సమయంలో ఆకాశం మొత్తం మేఘావృతమై, చినుకులు రాలుతున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు స్పాట్‌కు వచ్చారని చెప్పారు.

నేతల పరామర్శ, సంతాపం

నేతల పరామర్శ, సంతాపం

కాగా, నిషిత్ మృతి పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ సంతాపం తెలిపారు. పవన్ కళ్యాణ్, హరీష్ రావు వంటి నేతలు ఆసుపత్రికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని నెల్లూరుకు తరలిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+