పరిటాల శ్రీరామ్ పెళ్లి: ఉద్వేగానికి గురైన మంత్రి పరిటాల సునీత
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ - జ్ఞానవిల వివాహం అనంతపురంలో జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలి రానున్నారు.
అనంతపురం: ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ - జ్ఞానవిల వివాహం అనంతపురంలో జరగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు తరలి రానున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పది రోజులు ముందుగానే బంధువులు
ఈ కుటుంబంలో జరుగుతున్న తొలి ముఖ్యమైన శుభకార్యం కావడంతో ఈ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. సంప్రదాయాలకు అనుగుణంగా ఐదురోజుల పెళ్లి వేడుకను జరిపిస్తున్నారు. బంధుమిత్రులంతా పది రోజులు ముందుగానే వెంకటాపురం చేరుకుని ఏర్పాట్లు చూసుకుంటున్నారు.

పెళ్లి కొడుకు చేయడం దగ్గర నుంచి
సంప్రదాయంగా చేయాల్సిన కార్యక్రమాలకు ఏ లోటు లేకుండా చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా శ్రీరాంను పెళ్లి కొడుకు చేయడం దగ్గర నుంచి నలుగు పెట్టడం లాంటి కార్యక్రమాల వరకు అన్నింటిని సంప్రదాయ బద్దంగా చేస్తున్నారు.

పరిటాల సునీత ఉద్వేగం
పెళ్లి కొడుకును చేస్తున్న సమయంలో పరిటాల సునీత ఉద్వేగానికి గురయ్యారు. వెంటాపురం గ్రామానికి నాలుగు రోజులుగా వీఐపీ రాక కొనసాగుతోంది. వచ్చిన వారు శ్రీరాంను ఆశీర్వదిస్తున్నారు.

స్వచ్చంధంగా తరలి వస్తున్నారు
పెళ్లి పనులు చేయటానికి పరిటాల అభిమానులు వెంకటాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చారు. అలాగే పరిటాల అభిమానులు కూడా సొంతగా పెళ్లి కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేశారు.












Click it and Unblock the Notifications