Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు పై హీరో విశాల్ పోటీ - మంత్రి పెద్దిరెడ్డి తేల్చేసారు : అరవై వేల ఓట్ల మెజార్టీ..!!

కుప్పంలో వైసీపీ నుంచి బరిలో నిలిచే అభ్యర్ధి ఎవరు. కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్ లో ఈ అంశ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కుప్పంలో వరుసగా స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ రానున్న సాధారణ ఎన్నికల్లోనూ కుప్పం పైన స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం జగన్ సైతం 175 సీట్లు గెలవాలని చెబుతూ.. కుప్పంలో ఎందుకు గెలవలేమంటూ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామంటూ పలు సందర్భాల్లో మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు. దీనికి కౌంటర్ గా చంద్రబాబు సైతం పుంగనూరు లో ఈ సారి పెద్దిరెడ్డిని ఓడిస్తామంటూ కుప్పం వేదికగా స్పష్టం చేసారు.

కుప్పంలో హీరో విశాల్ పోటీ చేస్తారంటూ

కుప్పంలో హీరో విశాల్ పోటీ చేస్తారంటూ

ఈ మధ్య కాలంలో ప్రతీ మూడు నెలలకు ఒక సారి కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. దీని పైన స్పందించిన సీఎం...తమ దెబ్బకు చంద్రబాబు కుప్పంలో ఏకంగా ఇల్లు కట్టుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక, వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం కావటంతో.. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్ధిగా ఎవరు పోటీ చేస్తారనే దాని పైన అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

అందులో భాగంగా తమిళ హీరో విశాల్ పేరు సైతం తెర పైకి వచ్చింది. సీఎం జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటుగా.. కుప్పంలో తమిళ ఓటర్లు సైతం ఉండటంతో విశాల్ ను కుప్పం బరిలోకి దించుతారంటూ ప్రచారం సాగింది. అదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు కుమారుడు సుధీర్ రెడ్డి పేరు పైనా ప్రచారం జరిగింది.

అభ్యర్ది ఎవరో తేల్చేసిన మంత్రి పెద్దిరెడ్డి

అభ్యర్ది ఎవరో తేల్చేసిన మంత్రి పెద్దిరెడ్డి

ఈ మొత్తం ప్రచారానికి ముగింపు ఇవ్వటానికి అసలు కుప్పం నుంచి పోటీ చేసే అభ్యర్ధి ఎవరో మంత్రి పెద్దిరెడ్డి తేల్చి చెప్పేసారు. కుప్పంలో చంద్రబాబుపైన పోటీ చేసేది భరత్ మాత్రమే అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు. గతంలో రెండు సార్లు కుప్పం నుంచి పోటీ చేసి ఓడి పోయిన దివంగత చంద్రమౌళి కుమారుడు భరత్. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

రానున్న ఎన్నికల కోసం ఇప్పటికే భరత్ అక్కడ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు సైతం కొంత కాలంగా నియోకవర్గంలోని ప్రతీ ఇంటి పైన ఫోకస్ పెట్టారు. అదే విధంగా గతంలో వైసీపీ నుంచి గెలిచి తరువాత టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్న అమరనాధ రెడ్డి గురించి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. పలమనేరులో 2014లో అమరనాధ్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు.

2019 లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి వెంకట గౌడ్ గెలుపొందారు. రానున్న ఎన్నికల్లోనూ మాజీ మంత్రి అమర నాధ రెడ్డిని అరవై వేల ఓట్లతో ఓడిస్తామంటూ పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

Recommended Video

    YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
    చిత్తూరు నియోజకవర్గాల్లో ప్రతిష్ఠాత్మక పోరు

    చిత్తూరు నియోజకవర్గాల్లో ప్రతిష్ఠాత్మక పోరు

    ఇక, ఇటు పుంగనూరులో పెద్దిరెడ్డి పైన ఎవరిని బరిలోకి దించాలనే దాని పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తొలుత అమరనాధ రెడ్డినే మంత్రి పెద్దిరెడ్డి పైన పోటీకి దించాలనే ప్రతిపాదన పైన చర్చ జరిగింది. 2019 ఎన్నికల్లో అనీషా రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసారు. దీంతో..ఈ సారి అమరనాధ్ రెడ్డి పుంగనూరు లేదా పలమనేరు ఎక్కడి నుంచి పోటీ చేసినా 60 వేల మెజార్టీ సాధిస్తామనే విధంగా పెద్దిరెడ్డి వ్యాఖ్యలు చేసారు.

    దీంతో..ఈ సారి ఎన్నికల్లో కుప్పం..పుంగనూరు..పలమనేరు..నగరి తో సహా.. చిత్తూరు జిల్లాలో దాదాపు సగం సీట్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పార్టీ పరంగానే కాకుండా.. వ్యక్తిగతంగానూ ప్రతిష్ఠాత్మక పోరు సాగనుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+